తెలుగు చలనచిత్ర రంగంలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి... అందులో సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గ సినిమాల్లో ఒకటి ‘మాయాబజార్’.  ఇప్పుడు గ్రాఫిక్ టెక్నాలజీ, వ్యూజువల్ వండర్స్ తో సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు.  అవతార్ లాంటి కొత్త ప్రపంచాన్నే క్రియేట్ చేస్తున్నారు.  అలాంటిది  సిఎన్‌ఎన్-న్యూస్18 టీవీ చానెల్ నిర్వహించిన సర్వేలో భారతీయ అత్యుత్తమ  సినిమాల్లో ‘మాయాబజార్’నిలిచింది.  ఆంధ్ర దేశమంతటా 1957, మార్చి 27 వ తేదీన విడుదలై అద్భుత విజయం సాధించింది. 2017 మార్చి నాటికి  60 ఏండ్లు పూర్తిచేసుంది.  విజయా సంస్థ షావుకారు, పాతాళభైరవి, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గుండమ్మ కథ  లాంటి బ్లాక్ బస్టర్ మూవీలను తెరకెక్కించారు.

 

 తెలుగు సినీ అభిమానులకందించిన మరొక అపురూప కళాఖండం 'మాయాబజార్'. ఒక్క స్టార్ హీరో ఉన్నాడంటేనే ఆ సినిమాకు క్యూ కట్టే ఈ రోజుల్లో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి. రంగారావు, సావిత్రి లాంటి నటీనటులు నటించిన మాయాబజార్ సినిమా కోసం అప్పట్లో ప్రజలు నిద్రలు మానుకొని మరీ థియేటర్ల ముందు ఎదురుచూసారు. ఇందులో ఘటోత్కజుని మాయాలు చూస్తే కడుపుబ్బా నవ్వుతారు.  వివాహభోజనంబు వింతైన వంటకంబు ఈ సాంగ్ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది.

 

 ఈ మూవీలో రచయిత పింగళి నాగేంద్రరావు "తస్మదీయులు, దుష్టచతుష్టయం, జియ్యా, రత్న గింబళీ, గిల్పం, శాఖంబరి దేవి ప్రసాదం", వంటి కొత్త పదాలను మనకు రుచి చూపిస్తాడు.   రాజమౌళి గనక కిలికిలి భాష తో ఆకట్టుకున్నట్టు ఆనాడే ఆ ప్రయోగం చేశారు.  అగ్రశ్రేణి తారలంతా నటించిన విజయా వారి 'మాయాబజార్' చిత్రం విడుదలై నేటికి సరిగ్గా అరవై మూడు సంవత్సరాలు అవుతుంది. నిమా విడుదలైనప్పుడు విజయా సంస్థ నందమూరి తారక రామారావు నటించిన కృష్ణుని పాత్రతో ఉన్న ఫోటో క్యాలెండర్ గా చిత్రీకరించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  క్యాలెండర్లను ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: