రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏమి చేస్తాడో ఎవరీ తెలియదు. ఎప్పుడు ఎవరిని ఏ రకంగా ఎలా గిల్లాలో ఆయనకు తెలిసినంత ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడటం దాన్ని వివాదాస్పదం చేయడం వర్మ నుంచే చూసి నేర్చుకోవాలి. అంతేకాదు తనకు గిట్టని వాళ్లపై ఏదో కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలవడం వర్మకు ముందు నుంచి అలవాటు. అందుకే ఆయన్ని అందరూ వివాదాస్పద దర్శకుడు అంటారు. తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నుంచి ఆయన పూటకో ట్వీట్‌తో సంచలనం సృష్టిస్తున్నారు.

 

ఇప్పుడు తాజాగా కరోనాపై మరో ట్వీట్ చేశాడు. కరోనా వైరస్ పంపించమని ఎవరి భార్యో గట్టిగా ప్రార్థించినట్లు తాను అనుమానిస్తున్నానని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఎందుకంటే అన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ క్యాన్సిల్ అయ్యాయి, పబ్బులు బార్లు మూతపడ్డాయి, ఫ్రెండ్స్ తో కలిసి చిట్టా పాటి చేయడానికి లేదు, వర్క్ విషయంలో అబద్ధాలు చెప్పడానికి కూడా లేకుండా పోయింది, అన్నిటికంటే ముఖ్యంగా కేవలం భార్యతోనే గడపాల్సి వస్తుంది అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేసాడు.

 

ఇంతకుముందు 'భూమిపై ఉన్న జీవుల్లో మనుషులు మాత్రమే తమ సొంత ప్రాంతంలో ఉండకుండా ఎల్లప్పుడూ సంచారం చేస్తుంటారన్నారు. ఉన్నదాన్ని రెట్టింపు చేసుకోవాలని ఎల్లప్పుడు ప్రయాణిస్తూ భూమికి సంబంధించిన సహజ వనరులను నాశనం చేస్తుంటాడు. ఇదే రకమైన పని చేసే మరో జీవి వైరస్‌ మాత్రమేనన్నారు. భూ గ్రహానికి పట్టిన జబ్బు మానవులు అయితే మానవులకు పట్టిన రోగం వైరస్‌' అని ట్వీట్ చేసాడు. ఇదిలావుండగా కరోనా విజృంభణతో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నప్పటికీ క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 బిలియన్ల మంది ఇంటికే పరిమితమయ్యారు. భారత దేశంలో కరోనా వైరస్ నిర్మూలించేందుకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. పలువురు సెలబ్రెటీలు కూడా సోషల్ మీడియా ద్వారా అవగాహనా సూచనలు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: