టాలీవుడ్ లో హీరోలు మతాలకు చాలా దూరంగా ఉంటారు. వారి మతాలు ఏంటీ వారు ఏ దేవుడ్ని ఆరాధిస్తారు అనేది ఎక్కడా చెప్పుకునే ప్రయత్నం మాత్రం దాదాపుగా చేసే అవకాశం ఉండదు. కాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో మాత్రం ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అతను చేసే సినిమా కార్యక్రమాలు అయినా మరో సినిమా కార్యక్రమం అయినా సరే అతను మాలలో ఉంటే అలాగే వస్తాడు. చాలా మంది హీరోలు మాలలో ఉంటే దాన్ని బయటకు చూపించరు. కాని రామ్ చరణ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు. తన ఫోటోలు తీసినా సరే అభ్యంతరం మాత్రం తెలపడడు. 

 

సినిమా కార్యక్రమం అయినా సరే మరో కార్యక్రమం అయినా సరే తాను ఎలా ఉంటే అలాగే వస్తాడు గాని కొత్తగా వచ్చే ప్రయత్నం దాదాపుగా చేయడు. ఇక అతను ప్రతీ ఏటా కూడా మొక్కులు ఎక్కువగా చెల్లించుకుంటూ ఉంటాడని, అయ్యప్ప స్వామి సహా ఆంజనేయ స్వామిని బాగా పూజిస్తూ ఉంటాడని అంటారు. తమ కుటుంబ ఆరాధ్య దైవం హనుమాన్. కాని అతను వ్యక్తిగతంగా పూజించేది మాత్రం అయ్యప్ప స్వామికే. ఇలా ఎక్కడిక్కడ అతను హుందాగానే ప్రవర్తిస్తూ తన మతాన్ని దాచిన సందర్భం అంటూ పెద్దగా ఏదీ లేదు. 

 

సినిమాలను కూడా చాలా జాగ్రత్తగా పూజలు చేసే విడుదల చేస్తాడు. సినిమా షూటింగ్ సమయం లో కూడా వాస్తు, శాస్త్రాలు అన్నీ కూడా చూస్తూ ఉంటాడు రామ్ చరణ్. అన్నీ కూడా బాగున్నాయి అనుకుంటేనే సినిమా విడుదల చేస్తాడు గాని మరొక విధంగా ఉంటే మాత్రం సినిమా విడుదల చేసే ప్రయత్నం దాదాపుగా చేసే అవకాశం ఉండదు అని అంటూ ఉంటారు. ఎంత బిజీ గా ఉన్నా సరే అతను మొక్కలు చెల్లించుకోవడం మాత్రం ఆపడు.

మరింత సమాచారం తెలుసుకోండి: