రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో ఈరోజు జపాన్ లో విడుదలైంది. ట్విట్టర్ లో వస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాను అక్కడి ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం  కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో  విడుదలకావడంతో సాహు ఫుల్ రన్ లో ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కాగా కరోనా దృష్ట్యా రేపు, ఎల్లుండి జపాన్ లో థియేటర్లను మూసి వేయనున్నారు. నిజానికి మూడు నెలల ముందే ఈ విడుదల డేట్ ను ఫిక్స్ చేయడం తో తప్పనిసరి పరిస్థితుల్లో సాహో ను అక్కడ విడుదలచేయాల్సి వచ్చింది. 
 
ఇక బాహుబలి తో దేశ వ్యాప్తంగానే కాదు జపాన్ లో కూడా ప్రభాస్ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందు  సౌత్ నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ కు మాత్రమే జపాన్ లో అభిమానులు ఉండగా ఇప్పుడు ఈ జాబితాలో ప్రభాస్ కూడా చేరాడు. ఇదిలావుంటే గత ఏడాది భారీ అంచనాల మధ్యవిడుదలైన సాహో ఒక్కహిందీలో తప్ప మిగితా భాషల్లో డిజాస్టర్  ఫలితాన్ని రాబట్టింది. అయితే అంత నెగిటివ్ టాక్ తో కూడా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 400కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషం.
 
ఇక హిందీలోనైతే పాజిటివ్ టాక్ తో 150కోట్ల వసూళ్ల ను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది. ప్రస్తుతం ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తన 20 వ చిత్రంలో నటిస్తున్నాడు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా గోపి కృష్ణ మూవీస్,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్  డైరెక్షన్ లో తన 21 వ చిత్రంలో నటించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: