తెలుగు సాహిత్యం వెలుగు ప్రస్తుత పరిస్దితుల్లో ఆరిపోతుంది.. లోకం మారింది మనుషులు మారారు.. వారి ఆలోచనలు కూడా మారాయి.. ఇందుకు అనుగుణంగా సాహిత్యం కూడా మారింది.. ఒకప్పటి పాటలో అర్ధం ఉంది.. ఆర్తి ఉంది.. అందమైన సాహిత్యం ఉంది.. ఇందుకు ఉదాహరణగా మసక మసక చీకట్లో మల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో.. మనసైనది దొరుకుతుంది.. దొరుకుతుంది.. ఆ పాటలో ఒక అర్ధం ఉంది.. వింటుంటే ఉత్సాహంగా వస్తుంది.. ఇదే కాకుండా నాటికాలంలో ఐటం సాంగ్‌లు ఉన్నా.. నిండైన కట్టుబొట్టుతో, ఆ పాట కుటుంబం మొత్తం చూసిన సిగ్గు అనిపించేది కాదు.. ఇలా అప్పటి పాటలు సాహిత్య పరంగా, సంగీతపరంగా, అభినయం పరంగా మేలిమి ముత్యాల్లా నిలిచిపోయేవి..

 

 

కానీ నేటి కాలంలో ఐటం సాంగ్ అంటే.. అమ్మో.. అశ్లీల సాహిత్యం.. వినడానికే   భయం వేస్తుంటే..  ఎఫ్ ఎమ్ ల పుణ్యమా అని.. బుల్లి తెర మీద వెగటు వేసే డాన్సు ప్రోగ్రాంల పుణ్యమా అని ఊదరగొట్టిన పాటలు విన్న మూడేళ్ళ పిల్ల కూడా ఐటం సాంగ్ నేర్చుకుని పాడుతుంటే.. అర్ధం తెలిసిన పెద్ద వాళ్ళు  పరుగులెత్తి ఆ పిల్లల నోర్లు మూయాల్సింది పోయి వారు కూడ ఆహా మా పాప ఎంత అందంగా డ్యాన్స్ వేస్తుంది.. ఎంత చక్కగా పాడుతుంది అని మురిసిపోతున్నారు.. ఇదంతా ఒకెత్తైతే అసలు ఐటం సాంగ్స్ లో నటించే తారలకి సిగ్గే లేదనిపిస్తుంది... కాసుల కోసం రెండు కర్చీఫ్ ల్లాంటి పొదుపైన బట్టలతో.. వళ్ళు ఆరేసుకుంటుంటే.. మనం సినిమా చూడటం లేదుగా.. మనపిల్లలని చూడనీయకుండా కాస్త జాగ్రత్త పడాలి అనుకున్నా.. కుదిరి చావదు.

 

 

ఇక ఇలాంటి పాటలకి సాహిత్యం అందించే రచయితలకి అవకాశం దొరకడమే తరువాయి.. దర్శక, నిర్మాత, నటున్ని మెప్పించే రీతిలో.. అశ్లీల సాహిత్యం అందంగా పేర్చి అందిచడమే.. ఇక ప్రముఖ దర్శకులు కొందరైతే ఐటెం సాంగ్ లేనిదే సినిమా ఉండదు అన్నట్లు ఉంటారు.. వారి సినిమాల్లో ఏది ఏమైనా ఒక్క పాట అయినా అర్ధనగ్నంగా ఉండవలసిందే.. ఇలాంటి పరిస్దితుల్లో అందమైన పాట రూపంలో వచ్చే సాహిత్యం కరువై సిగ్గుతో చచ్చిపోతుంది.. తెలుగు బాష బ్రతకాలంటే ముందుగా సాహిత్యం బ్రతకాలి.. సాహిత్యం బ్రతకాలంటే సాహిత్య పరమైన భావం గల పాటలు రావాలి.. కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో ఇది అసాధ్యం..  

మరింత సమాచారం తెలుసుకోండి: