తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ వినిపించే మాట ఒకటే, ఇక్కడ హీరోలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది, హీరోయిన్ కు ఏ మాత్రం ప్రాధాన్యం ఉండదు అనే మాట గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. అయితే తెలుగు సినిమాలలో నటించిన కొంత మంది నేటి తరం హీరోయిన్లు కూడా ఇదే మాట చెబుతున్నారు. ఇక్కడ హీరో కి ఉన్న స్వేచ్ఛ, సౌకర్యాలు హీరోయిన్ కు ఇవ్వరు అని అంటున్నారు. కొన్ని సినిమాలలో కూడా హీరోయిన్ పాత్ర కేవలం పాటల వరకే పరిమితం అవుతుంది అని అంటున్నారు. 

 

అంతే కాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ కు సినిమాలో ఐటమ్ సాంగ్ ఒకటి తప్పని సరిగా చెయ్యాలి అనే నిబంధన కూడా ఉంటుందని కొందరు హీరోయిన్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్కోసారి తమకు అవకాశాలు రావాలి అంటే ఐటెమ్ సాంగ్ తప్పనిసరి అని అంటున్నారు. తమిళ్ సిని పరిశ్రమ తో పోలిస్తే ఇక్కడ హీరోయిన్ కు నటనకు ప్రాధాన్యం అంతగా ఉండదు, అందం ఉంటే చాలు అని పలువురు అంటున్నారు. అంతే కాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ వేసుకునే కాస్ట్యూమ్స్ విషయంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. 

 

ఇక్కడ హీరోయిన్ స్కిన్ షో చేసి, డాన్స్ చేస్తే చాలు నటన అవసరం లేదు అనే మాట వినిపిస్తుంది. తెలుగు సినీ పరిశ్రమ కమర్షియల్ కోణంలో మాత్రమే ఆలోచిస్తుందని, ఇక్కడ హీరో ఇమేజ్ బట్టి సినిమాలు తీస్తారు అనే మాట గత కొన్నేళ్లుగా మనం వింటూనే ఉన్నాం. చాలా మంది టాలెంట్ ఉన్న హీరోయిన్లు ఇక్కడి వాతావరణానికి విసిగిపోయి పొరుగు ఉన్న తమిళ్, కన్నడ, మలయాళీ ఫిల్మ్ ఇండస్ట్రీలలో తమ టాలెంట్ నిరూపించుకోవడం కోసం అవకాశాలు వెతుక్కుంటున్నారు. అంతే కాకుండా ఇక్కడ ఏ మాత్రం గుర్తింపు రాని హీరోయిన్లు కొందరు వేరే భాషలలో నటించి మంచి గుర్తింపు పొందిన వారు కూడా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికైనా తెలుగు సినీ పరిశ్రమ కొత్త ఆలోచన చేసి కమర్షియల్ కోణాన్ని వీడితే మంచిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: