ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమా పూర్తవడానికి ఇంకా నాలుగు నుంచి అయిదు నెలలు పట్టనుందని చిత్ర యూనిట్ సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యే వరకు వేరే సినిమా గురించి ఆలోచించే టైమ్ చరణ్ దగ్గర లేదు. ప్రస్తుతం రాజమౌళి ఈ ఇద్దరి పైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు.

 

ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా సెట్స్‌ పై ఉండగానే మరో సినిమా గురించి ఆలోచిస్తున్నాడు. రామ్ చరణ్ తన తర్వాత సినిమాపై ద్రుష్టి పెట్టాడు. అయితే.. ఈ విషయమై కొంతమంది దర్శకులు చెప్పే కథలను రామ్ చరణ్ వింటున్నాడు. ఇప్పటి వరకు హరీష్ శంకర్, సుజీత్, గౌతమ్ తిన్నూరి లాంటి దర్శకులు చరణ్‌ను కలిసి లైన్స్ చెప్పారని తెలుస్తుంది. వీరెన్ని కథలు చెప్పిన వీళ్లందరి కంటే ముందంజలో అనిల్ రావిపూడి ఉన్నాడు.

 

అయితే.. దర్శకుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించి ఘానా విజయం సాధించాడు. ఈ సినిమా ఏకంగా 130 కోట్ల వరకు సాధించింది. ప్రస్తుతానికి అనిల్ రావిపూడి మంచి రేస్ మీద ఉన్నాడు. అందుకే రామ్ చరణ్ కూడా ఈ దర్శకుడితో పని చేయాలని అనుకుంటున్నాడట. అనిల్ రావిపూడి సినిమా పూర్తి కథ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

 

దీంతో.. అనిల్, చరణ్ కాంబినేషన్‌ పై అంచనాలు పెరిగి పోతున్నాయి. అనిల్ ప్రస్తుతం తెరకెక్కించాలనుకున్న ఎఫ్ 3 కొన్ని రోజులు ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. దాంతో చరణ్ తో చేసే చిత్రానికి కొంచెం ఆలస్యమయ్యేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: