టాలీవుడ్ సినిమా రంగంలో దిగ్గజం నిర్మాతల్లో ఒకరు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్. మెగా కాంపౌండ్ కి చెందిన హీరోలతో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో చాలా సినిమాల్లో అల్లు అరవింద్ నిర్మించడం జరిగింది. సినిమారంగంలో థియేటర్ల విషయంలో అదే విధంగా నిర్మించడం విషయంలో మంచి చేయితిరిగిన సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా అల్లు అరవింద్ కు మంచి పేరు ఉంది. ఇటీవల అల వైకుంఠ పురంబులో సినిమా చేసి అదిరిపోయే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఇటువంటి అల్లు అరవింద్ కి ఎప్పుడూ లేని విధంగా ఇన్నేళ్ల లో వ్యాపార రంగంలో అతి దారుణమైన ప్లాప్ ఎదుర్కొన్నటు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళితే ఇటీవల డిజిటల్ ఓటీటీ రంగంలోకి అల్లు అరవింద్ ఎంట్రీ ఇచ్చారు.

 

ఆహా - ఓటీటీ అనే పేరుతో డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్ దీన్ని ప్రమోట్ చేయడంలో పెద్దగా శ్రద్ధ తీసుకోలేదు. ప్రమోషన్ విషయంలో కూడా సరిగ్గా ఏమీ పట్టించుకోలేదు. అంతేకాకుండా పెద్ద సినిమాలేవీ కూడా కొనలేదు...ఉన్న వెబ్ సిరీస్ లు ఏవీ అంత ఎఫెక్టివ్ గా లేనే లేకపోవడం అతి పెద్ద మైనస్. మొత్తంమీద చూసుకుంటే ప్రమోషన్ విషయంలో చాలా డల్ అయ్యింది. ప్రస్తుత రోజుల్లో ఒక చిన్న వెబ్ సైట్ స్టార్ట్ చేస్తే బిజినెస్ ప్రకటనలు ఇచ్చి పబ్లిక్ లోకి బాగా నాటుకు పోయేలా ప్రమోట్ చేసుకుంటున్న రోజులివి.

 

ఇటువంటి తరుణంలో బయట భయంకరమైన ఈ కాంపిటీషన్ లో ఆహా - ఓటీటీ వేదికను ప్రజల్లోకి అల్లు అరవింద్ తీసుకోలేకపోయారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అల్లు అరవింద్ తెలుసు అనే ప్రజలు కి కనీసం ఆహా - ఓటీటీ అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితిలో సిచువేషన్ ఉంది. ఉన్న కంటెంట్ కూడా సరైన దమ్ములేని కంటెంట్ అవ్వటంతో పెద్దగా ఎవరూ దీన్ని పట్టించుకోవడం లేదు. దీంతో సినిమాను నిర్మించడం విషయంలో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అరవింద్ ఆహా - ఓటీటీ సరైన గుర్తింపు పొందలేక పోయింది అని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: