ఒక హీరోతోనే సంచలనాలు సృష్టించే రాజమౌళికి ఇద్దరు సూపర్ స్టార్స్ దొరికారు. ఆర్.ఆర్.ఆర్ అంటూ ఎన్టీఆర్, తారక్ తమ నట విశ్వరూపం చూపించేందుకు సిద్ధమవుతున్నారు. టైటిల్ ఎనౌన్స్ మెంట్ నుండి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా కొత్తగా టైటిల్ పోస్టర్, చరణ్ ఫస్ట్ లుక్ వీడియో సినిమా మరో బాహుబలి కాదు అంతకుమించి అనేట్టుగా అంచనాలు పెంచాడు రాజమౌళి. ఈరోజు రామ్ చరణ్ బర్త్ డే కి పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ కు మెగా ఫ్యాన్స్ కృతజ్ఞతలు చెబుతున్నారు.

 

ఇక ఇదిలాఉంటే ఆర్.ఆర్.ఆర్ లో మరో క్రేజీ హీరో నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ హీరో ఇళయదళపతి విజయ్ కూడా ట్రిపుల్ ఆర్ లో ఒక రోల్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. తమిళంలో విజయ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి విజయ్ ఆర్.ఆర్.ఆర్ లో ఉంటే అంచనాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే విజయ్ నిజంగా ఆర్.ఆర్.ఆర్ లో ఉండే ఛాన్స్ ఉందా అన్న డౌట్ రాక మానదు. విజయ్ ఒకవేళ ఓకే చెబితే మాత్రం ఆ రచ్చ మాములుగా ఉండదు. 

 

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలిసిందే. ఇక ఇప్పుడు విజయ్ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నాడని తెలుస్తుంది. అదే జరిగితే మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ఏంటన్నది రాజమౌళి మరోసారి చూపిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే చరణ్ అల్లూరి పాత్ర ఫస్ట్ లుక్ చూసి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకుడు సైతం సినిమా రేంజ్ ఏంటన్నది అర్ధం చేసుకున్నాడు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: