తెలుగు, తమిళ భాషల్లో ఒక మోస్తారు హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రణీత స్టార్ హీరోయిన్స్ కూడా చేయలేని పని చేస్తూ శభాష్ అనిపించుకుంటుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలో నానా హంగామా చేస్తుంది. ఈ వైరస్ సోకకుండా తమని తామే కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందుకే ప్రధాని మోడీ మూడు వారాలు లాక్ డౌన్ ప్రకటించారు. అయితే నిత్యావసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కొంత వెసులుబాటు కల్పించారు. అయితే దాన్ని కూడా సరిగా వాడుకోకుండా పోలీసుల లాఠీలకు పని చెబుతున్నారు ప్రజలు. ఆంక్షలు విధించింది ఈ వైరస్ నుండి ప్రజలను కాపాడేందుకే అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి.   

 

ఇదిలాఉంటే కరోనా వల్ల చాలామంది ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సాఫ్ట్ వేర్ వాళ్లకయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది. కానీ మిగతా వారు నిత్యావసరాల కోసం కూడా నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక ఇలాంటి టైం లో ప్రభుత్వానికి అండగా ఉంటున్నారు సినీ తారలు. టాలీవుడ్ నుండి చిరంజీవి, రామ్ చరణ్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, నితిన్ ఇలా అందరు విరాళాలు ప్రకటించారు. ఇప్పటివరకు హీరోలే విరాళాలు ప్రకటించారు కానీ హీరోయిన్స్ నుండి ఎలాంటి ప్రకటనలు రాలేదు. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారు కానీ ఇలాంటి టైం లో స్పందించారు అంటూ నెటిజెన్ల కామెంట్స్ చేస్తున్నారు. కేవలం కరోనా రాకుండా జాగ్రత్తలు చెబుతున్నారే తప్ప హీరోలు ప్రకటించినట్టుగా విరాళాలు మాత్రం ఏ ఒక్కరు ప్రకటించలేదు. 

 

ఒకరితో తనకేంటి అంటూ ఈ మంచి కార్యానికి ముందడుగు వేసింది హీరోయిన్ ప్రణీత. ప్రణీత ఫౌండేషన్ ద్వారా లాక్ డౌన్ సందర్భంగా 50 కుటుంబాలకు 2000 రూపాయల ఆర్ధిక సాయం అందిస్తున్నట్టుగా ఆమె ప్రకటించారు. ప్రణీత గొప్ప మనసుకి అందరు హ్యాట్సాప్ చెబుతున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: