దేశ వ్యాప్తంగా ప్రజలను గడ గడ లాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి మరింత జోరందుకుంది.. జనతా కర్ఫ్యూ పేరిట ఎంత కట్టడి చేయాలని ప్రభుత్వం ప్రయత్నించినా కూడా అంతై వటుడంతై అన్నట్లు దాని ప్రభావాన్ని పెంచుకుంటూ వస్తుంది.. ప్రభుత్వం పథకాలను బెడిసి కొట్టినట్లు చేస్తుంది. ప్రజలు గుంపుగా ఉంటే ఒకరి నుంచి మరొకరికి ఈ కరోనా వ్యాపిస్తుంది అనే ఉద్దశ్యంతో ప్రజలను ఇళ్లకే పరిమితమయ్యారు.. అయినా కరోనా కారణంగా చూస్తుండగానే చాలా మంది చనిపోతున్నారు..

 

 

లాక్ డౌన్ పేరుతో ప్రభుత్వం ఎంత నివారణ చేపట్టిన కూడా కరోనా ఉగ్రరూపం మాత్రం తగ్గలేదు ... ఈ లాక్ డౌన్ ను రెండు నెలల వరకు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.. ఇకపోతే ప్రజలు ఎటువంటి పనిలేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.. ఈ మేరకు సినీ రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. ఇప్పటికే చాలా మంది విరాళాన్ని అందించి పెద్ద మనసును చాటుకున్నారు.. 

 

 


తాజాగా కరోనా ప్రభావం పై సినీ నటుడు , నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చికెన్ తినొద్దన్న దుష్ప్రచారంతో వాటి అమ్మకాలు భారీగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఈ దుష్ప్రచారాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రెస్ మీట్ లో ఖండించడమూ విదితమే. ఈ నేపథ్యంలో పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ అధినేత, ప్రముఖ నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఓ ఆసక్తికర ట్వీట్ పోస్ట్ చేశాడు.. 

 

 

మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ మీ సహాయానికి  పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్’ బండ్ల గణేశ్ నమస్కారం అంటూ తెలంగాణ సీఎంఓ ను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తో పాటు సీఎం కేసీఆర్ ఫొటోను జతపరిచారు. ‘థ్యాంక్యూ సార్’ నమస్కారం అంటూ మరో పోస్ట్  చేసిన బండ్ల గణేశ్, ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడిన ఓ వీడియోను జతపరిచారు. కాగా, బండ్ల గణేశ్ తొలుత చేసిన పోస్ట్ పై పలువురు విమర్శలు కూడా అందిస్తున్నారు.. కాగా, నువ్వు తోచిన సాయాన్ని అందించు అంటూ హితబోధ చేస్తున్నారు..ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: