కొంతమంది దర్శకులు కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాక నిర్మాతగా మారతారు. కొంతమంది మాత్రం నిర్మాతగా సినిమాలు మనకెందుకు అనుకుని కుదురుగా దర్శకుడిగానే కంటిన్యూ అవుతుంటారు. సుకుమార్ లాంటి వాళ్ళు మాత్రం తన దగ్గర అసోసియోట్స్ గా చేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వడానికే నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు కూడా సుక్కు దగ్గర పనిచేసిన వ్యక్తే. ఇక ఇలా మరో దర్శకుడు నిర్మాతగా మారబోతున్నాడు. అయితే ఇది కొంతమంది నెగిటివ్ గా చూస్తున్నారు. 'శతమానం భవతి' సినిమాతో మంచి సక్సస్ ని అవార్డులు రివార్డులు అందుకున్నాడు సతీష్ వేగేశ్న.  

 

మొదటి సినిమాతోనే కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. కాని తర్వాత ఈయన తీసిన 'శ్రీనివాస కళ్యాణం'.. 'ఎంత మంచివాడవురా' బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా కొట్టాయి. తీసిన మూడు సినిమాలలో ఒకటి సూపర్ హిట్ అయితే రెండు దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. దాంతో ఇక ఈ దర్శకుడికి మళ్ళీ దర్శకుడిగా సినిమా రావడం కష్టమే అనుకున్నారు. కాని ఈయన ఇప్పుడు నిర్మాతగా మారి అందరికి షాకిచ్చాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ హీరోగా నటిస్తాడని తాజా సమాచారం. ఈ చిత్రానికి 'నంది' అనే టైటిల్ ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సతీష్ దర్శకత్వం వహించకుండా మరో డైరెక్టర్ కు అవకాశం ఇస్తున్నారట. మొన్న సంక్రాంతి బరిలో దిగి నందమూరి కళ్యాణ్ రాంతో తీసిన 'ఎంత మంచివాడవురా' ఫ్లాప్ తో సతీష్ వేగేశ్న ఇక సినిమాలని తెరకెక్కించకూడదని నిర్ణయించుకున్నారట.

 

ఇక అల్లరి నరేష్ హీరో అన్నది కూడా ఎంతవరకు కరెక్ట్ అన్న టాక్ వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ కి హిట్ అన్నది దక్కలేదు. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా కూడా నరేష్ కి అంతగా ఉపయోగపడింది లేదు. ఏదో ఒక్క సినిమా ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. కాని ఆ సినిమా పరిస్థితి ఏంటన్నది అందరికి అర్థమవుతూనే ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో సతీష్ వేగేశ్న అల్లరి నరేష్ ని పెట్టి సినిమా తీయాలనుకోవడం ఏంటో మరి. అందుకే మీరు దర్శకుడిగా ఎన్ని సినిమా తీసి హిట్ కొట్టారు ...ఇప్పుడు నిర్మాతగా సినిమాలు తీయడానికి అంటున్నారట.   

మరింత సమాచారం తెలుసుకోండి: