ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ సంచలనంగా మారిన సినిమా దర్శక ధీరుడి  "ఆర్ ఆర్ ఆర్". బాహుబలి ప్రాంఛైజీ తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ మీద దేశం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది. టాలీవుడ్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు మామూలుగా లేవు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ని 'కొమరం భీమ్' గా రామ్ చరణ్ ని 'అల్లూరి సీతారామరాజు' గా చూపించబోతున్నారు జక్కన్న. ఈ సినిమాకి 'రౌద్రం రణం రుధిరం' అన్న టైటిల్ ని ఫైనల్ చేసి ఉగాది సందర్భంగా మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా కాస్త నెగిటివ్ టాక్ వినిపించింది. 

 

కాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల టీజర్ తో 'రౌద్రం రణం రుధిరం' సినిమా రేంజ్ ఏంటో అందరికి అర్థమైపోయింది. నిజంగా జక్కన్న చరణ్ ని తారక్  ని ఎలా చూపించబోతున్నారో ఎవరి ఊహకి అందదని ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇదిలా ఉంటే 'రౌద్రం రణం రుధిరం' సినిమా కోసం తారక్ ఒక రిస్క్ చేయబోతున్నాడని సమాచారం. ఈ సినిమా తమిళ, హిందీ వెర్షన్ల కి ఎన్టీఆర్ స్వయంగా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పడానికి ఆసక్తిగా ఉన్నట్టు ఆ విషయాన్ని జక్కన్నకి తెలిపినట్టు చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారం. ఇక జక్కన్న కూడా తారక్ కి ఒకే అని చెప్పారట. అయితే హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఎన్టీఆర్ కు హిందీ లో డబ్బింగ్ చెప్పడం చాలా ఈజీనే. 

 

కానీ పెద్ద రిస్క్ అంటే తమిళ వర్షన్ కి చెప్పాలనుకోవడమే. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. తమిళ వర్షన్ కి తారక్ డబ్బింగ్ చెప్పకపోతేనే బెటర్ అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇక 'రౌద్రం రణం రుధిరం' సినిమా భారతీయ భాషల్లోని 10 భాషలలో విడుదల కానున్నట్లు చెప్పుకుంటున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ నటులతో పాటు అజయ్ దేవగణ్ అలియా భట్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 'రౌద్రం రణం రుధిరం' జనవరి 8న విడుదల చేయబోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: