టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఇప్పటివరకు వచ్చిన హీరోయిన్లలో కొందరు నటీమణులు ఫ్యామిలీ హీరోయిన్లుగా ముద్ర వేసుకుంటే, మరికొందరు కొంత రొమాంటిక్ పాత్రల్లో నటించి రొమాంటిక్ హీరోయిన్లుగా పేరు దక్కయించుకున్న వారు ఉన్నారు. అయితే ఒకప్పటితో పోలిస్తే రాను రాను ప్రేక్షకుల అభిరుచుల మేరకు హీరోయిన్లు కూడా తప్పనిసరిగా ఒకింత ఎక్స్ పోజింగ్ చేయవలసిన పరిస్థితులు ఉన్నాయని కొందరు సినిమా వ్యక్తులు బహిరంగంగానే చెప్తూ ఉండడం విశేషం. 

 

అయితే మరీ బాలీవుడ్ సినిమా పరిశ్రమ మాదిరిగా ఓవర్ గా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా టాలీవుడ్ లో ప్రస్తుత హీరోయిన్లు లో కొందరు మాత్రం, పాత్ర యొక్క పరిధి అవసరం మేరకు ఎక్స్ పోజింగ్ కు మేము సిద్ధం అని అంటున్నారు. అయితే ఆ విధంగా ఎక్స్ పోజింగ్ చేయడానికి నేను ఎప్పుడూ సిద్దమే అని చెప్పడంతో పాటు ఆ మధ్య ఒక హిందీ సినిమాలో ఏకంగా శృంగార సన్నివేశాల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచిన యువ భామ రాధికా ఆప్టే. తెలుగులో రామ్ గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర తో పాటు నటసింహం బాలకృష్ణ సరసన లెజెండ్, లయన్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాధికాకు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంది. 

 

అయితే ఇటీవల ఒకానొక ఇంటర్వ్యూ లో మాట్లాడిన రాధికా, తన దగ్గరకు మంచి శృంగారభరిత అంశాలున్న స్టోరీ లను పలువురు దర్శకులు తీసుకువస్తున్నారని, అయితే వాటిలో తన పాత్ర యొక్క పరిధి, అవసరం మేరకు ఆ పాత్రలో ఎక్స్ పోజింగ్ చేయాలంటే తాను ఎప్పుడూ సిద్దంగానే ఉన్నానని రాధికా అన్నారు. ప్రజలు చూడడానికి ఇష్టపడుతున్నప్పుడు, మేము ఎక్స్ పోజింగ్ చేస్తే తప్పేంటి, అయినా మేము ప్రతి సినిమాలో కూడా ఎక్స్ పోజింగ్ చేస్తే తప్పు కానీ, పక్కాగా క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు అలా నటిస్తే తప్పు కాదని రాధికా అనడం కొసమెరుపుగా చెప్పుకోవాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: