టాలీవుడ్ సినిమా పరిశ్రమకు 1992లో వచ్చిన భారతం అనే సినిమా ద్వారా నటిగా పరిచయం అయిన బెంగళూరు భామ సౌందర్య, అంతకముందు కన్నడ లో వచ్చిన గంధర్వ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే తెలుగులో ఆ తరువాత మనవరాలి పెళ్లి, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, నెంబర్ వన్, హలో బ్రదర్, అమ్మోరు, పవిత్ర బంధం, అన్నయ్య, పెదరాయుడు సహా మరికొన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సౌందర్యకు అప్పట్లో సావిత్రి తరువాత నటిగా అంత మంచి పేరు వచ్చిందనే చెప్పాలి. 
 
ముందుగా మెల్లగా అవకాశాలు అందుకున్న సౌందర్యకు ఆ తరువాత అవి పెరగడం, ఆపై వాటిని మంచి హిట్స్ గా మలుచుకోవడంలో చాలావరకు సౌందర్య సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. అయితే కెరీర్ పరంగా పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన సౌందర్య దాదాపుగా అన్ని సినిమాల్లో కూడా ఎక్స్ పోజియింగ్ కు పెద్దగా అవకాశం లేని పాత్రల్లోనే నటించారు. ఇక అప్పట్లో టాలీవుడ్ లో దాదాపుగా అందరు అగ్ర హీరోల సరసన ఆమె హీరోయిన్ గా నటించడం, మంచి హిట్స్ అందుకోవడం జరిగింది.
 
ఆమెకు ఎక్కువగా కథా, పాత్ర ప్రాధాన్యం ఉండే సినిమాలంటేనే ఇష్టం అని, ప్రేక్షకుల్లో అటువంటి సినిమాలే తనకు నటిగా మంచి గుర్తింపు తెస్తాయని, గ్లామరస్ నటిగా కంటే మంచి పాత్రలతో నటిగా పేరు సంపాదించుకోవాలనేది ఆమె కోరికని ఇప్పటికీ ఆమెతో కలిసి పని చేసిన కొందరు నటీనటులు చెప్తూ ఉంటారు. ఆ విధంగా మహానటి సావిత్రి తరువాత ఫ్యామిలీ హీరోయిన్ గా ఎక్స్ పోజింగ్ కు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా, తన అద్భుత నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న సౌందర్య, మనల్ని అందిరినీ విడిచి 2004లో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు.  కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కలిసి నటించిన శివశంకర్, నటిగా తెలుగులో ఆమె ఆఖరి సినిమా. భౌతికంగా ప్రస్తుతం ఆమె మన ముందు లేనప్పటికీ, ఆమె నటించిన  సినిమాలు, పోషించిన పాత్రలు, ఎప్పుడూ మన తెలుగు ప్రజలు మరిచిపోలేరు అనే చెప్పాలి....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: