రాను రాను మారుతున్న కాలాన్ని బట్టి ఈ డిజిటల్ యుగంలో కొత్త కొత్త సాధనాల రాకతో పాటు, దాదాపుగా ప్రతి విషయంలోను మనిషి యొక్క అభిరుచులు కూడా మారుతూ పోతున్నాయి. ఇక అదే సినిమాల విషయం చెప్పుకుంటే, ఒకప్పుడు దాదాపుగా ఒక 60 ఏళ్ల క్రితం ఎక్కువగా కథా ప్రాధాన్యం ఉండే సినిమాలకే విలువ నిచ్చేవారు. అయితే ఆ తరువాత హీరోల రంగప్రవేశం, ఆపై మెల్లగా హీరోలకు డిమాండ్ పెరగడం, హీరోయిన్ల ప్రవేశం, వారికి కూడా క్రేజ్ ఏర్పడడం జరుగుతూ వస్తోంది. ఇక అక్కడి నుండి రాను రాను హీరోయిన్ల అందం, అభినయం పై కూడా ప్రేక్షకులకు మోజు ఏర్పడినప్పటికీ అప్పట్లో కూడా మంచి కథా బలం ఉన్న సినిమాలు వచ్చేవి. అయితే ఇటీవల ఒక 10 ఏళ్ళ క్రితం వరకు కూడా మంచి కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చాలావరకు ప్రేక్షకాదరణ పొందేవి అనే చెప్పాలి. 

 

అయితే పరిస్థితుల ప్రభావమో, లేక పాశ్చాత్య పద్ధతులు మనలోకి మరింతగా చొచ్చుకు వెళ్లడం కారణమో తెలియదుగాని ఎక్కువగా ప్రేక్షకులు రొమాంటిక్ అంశాలున్న సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారని ఇటీవల కొన్ని సర్వేలు కూడా తేల్చాయి. అయితే మధ్యలో కొన్ని మంచి స్టోరీ, కాన్సెప్ట్ తో కూడిన మంచి సినిమాలు వస్తున్నప్పటికీ, ఎక్కువగా శృంగార భరిత సన్నివేశాలతో పాటు హీరోయిన్లు ఎక్కువగా ఎక్స్ పోజింగ్ చేస్తున్న సినిమాలనే చూడడానికి ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు. అంతేకాక హీరోయిన్ల పాత్ర, నటన కంటే కూడా సదరు హీరోయిన్ ఎంత అందంగా ఉంది, ఎటువంటి దుస్తులు ధరించింది, ఏయే సన్నివేశాల్లో ఎంత రొమాంటిక్ గా కనిపించింది. 

 

హీరో, హీరోయిన్ల మధ్య మంచి రొమాన్స్ ఉందా లేదా అనేవే నేడు ముఖ్య భూమిక పోషిస్తున్నాయని అంటున్నారు. అయితే ఈ విషయమై ఇటీవల కొందరు హీరోయిన్లు కూడా బహిరంగంగానే మాట్లాడుతున్నారని, పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడంటే విపులంగా చెప్పే కథలు, సినిమాల్లోని పాత్రలు, వారి నటన చూడడానికి ప్రేక్షకులు థియేటర్ కి వచ్చే వారని, అయితే మెల్లగా అది తగ్గుతూ ప్రస్తుతం ఏ హీరోయిన్ ఎంత ఎక్కువగా విప్పి చూపిస్తే, వారికి అంత గొప్ప క్రేజ్ అని, అటువంటి సినిమాలే ప్రేక్షకులు కూడా చూస్తున్నారని అంటున్నారట. అయితే ఇటువంటి ధోరణి, ప్రేక్షకుల్లో మారనంతకాలం తాము కూడా ఆ విధంగా నటించక తప్పని పరిస్థితులు ఉన్నాయని మరికొందరు నటీమణలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు చెప్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: