ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం సినిమాలు చూసే ప్రేక్షకుల అభిరుచుల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి అనే చెప్పాలి. ముఖ్యంగా ఒకప్పుడు అయితే ఎక్కుగా కథాబలం ఉన్న సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రేక్షకుడు, రాను రాను ఎక్కువగా వెరైటీ కథల సినిమాలతో పాటు ఎక్స్ పోజింగ్, రొమాంటిక్ అంశాలున్న సినిమాలనే చూడడానికి ఇష్టపడుతున్నాడని కొందరు సినిమా విశ్లేషకులు అంటున్నారు. ఇక ప్రస్తుతం పరిస్థితి చూసుకుంటే, అటు బాలీవుడ్ లో అయితే ఎక్కువగా రొమాంటిక్ అంశాలున్న సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారని, అయితే సౌత్ సినిమా ప్రేక్షకులు మాత్రం ఆ విషయంలో కొంచెం బెటర్ అని అంటున్నారు. 

 

కానీ ఇక్కడ కూడా హీరోయిన్లకు గ్లామరస్ రోల్స్ లో నటించడంతో పాటు, ఎక్కువగా ఎక్స్ పోజింగ్ వంటివి చేయని తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, మూడేళ్ళ క్రితం ఒక సూపర్ హిట్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఒక యువ భామ, ఇటీవల తన వద్దకు వచ్చిన కొన్ని మంచి సినిమా అవకాశాలను కావాలనే తిరస్కరించిందట. అయితే ఆమె వద్దకు వచ్చిన కథల్లో ఎక్కువగా ఎక్స్ పోజింగ్ కు అవకాశం ఉన్న పాత్రలే అని, ప్రస్తుతం యూత్ కూడా అటువంటి సినిమాలు చూడడానికే ఇష్టపడుతున్నారు కనుక మీరు మా సినిమాల్లో నటించాలని ఎందరు కథకులు, దర్శకులు కోరినప్పటికీ సదరు హీరోయిన్ మాత్రం ససేమిరా అంటోందట. 

 

అయితే తనకు మంచి కథ, పాత్ర ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించాలని ఉందని, తనకు ఎక్స్ పోజింగ్ వంటివి చేయడం ఇష్టం లేదని తనవద్దకు వస్తున్న దర్శకులకు తెగేసి చెప్తోందట. ఆమె ఈ విషయమై గట్టిగా పట్టుబట్టడంతోనే ఇటీవల పలు బడా ఆఫర్లు కూడా మిస్ అయ్యాయని, ఈ విషయమై ఆమె తన ధోరణి మార్చుకోవాలని, ఎందుకంటే మిగతా హీరోయిన్లు అటువంటి రోల్స్ చేయడం లేదా ఏంటి అంటూ కొందరు దర్శకులు ఆమెపై విమర్శలు చేస్తున్నారట. అయితే ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరై ఉంటుందా అంటూ ప్రస్తుతం టాలీవుడ్  ప్రేక్షకులలో జోరుగా చర్చలు ఊపందుకున్నాయి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: