కమల్ హాసన్ కూతురిగా సినీ ప్రపంచానికి పరిచయం అయిన హీరోయిన్ శ్రుతీ హాసన్. ఆమె తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో తమిళంలో అగ్ర హీరోలతో ఆమె ఎక్కువగా సినిమాలు చేసింది. ఈ సినిమాలలో ఎక్కువగా ఆమె స్కిన్ షో చేసింది. చాలా సినిమాల్లో ఆమె రెచ్చిపోయింది. కెమెరా ముందు ఆమె నటించడానికి ఎక్కడా భయపడలేదు. తన అందాన్ని చూపించడానికి ఆమె ఏ మాత్రం సిగ్గు పడేది కాదు అనే మాట వాస్తవం. ప్రస్తుతం ఆమె చేతిలో అవకాశాలు అంటూ ఏమీ లేవు అనేది అర్ధమవుతుంది. దానికి కారణం ఏంటో తెలియదు గాని ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదు. 

 

తెలుగులో అవకాశాలు వచ్చిన సమయంలో ఆమె కాస్త దురుసుగా వ్యవహరించి ఆ అవకాశాలను వదులుకుంది. ఇప్పుడు మళ్ళీ అవకాశాల కోసం ట్రై చేస్తున్నా సరే ఆమెను పట్టించుకునే వారు అంటూ పెద్దగా ఎవరూ లేరు. అయితే ఆమె స్కిన్ షో చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేసే పరిస్థితి ఉండదు. చిన్న చిన్న హీరోల పక్కన అయినా పెద్ద హీరోల పక్కన అయినా సరే దర్శకుడు చూపించు అంటే చూపిస్తుంది ఆమె. ఏ డ్రెస్ వేయడానికి అయినా సరే ఆమె భయపడకుండా వేస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కాటమరాయుడు సినిమాలో ఆమె చేసిన పాత్రపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. 

 

స్కిన్ షో చేయడానికి కోటి మార్కెట్ లో దొరికే కొన్ని డ్రెస్ లు వేసుకుంది అనే విమర్శలు ఉన్నాయి. దర్శకుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. అయితే ఆమె చూపించు అని అనగానే ఏ మాత్రం కూడా భయపడకుండా స్కిన్ షో చేస్తుంది అంటున్నారు. తమిళంలో అయినా సరే ఆమె ఇదే విధంగా నటిస్తూ ఉంటుంది. ఆమె తన పాత్రకు స్కిన్ షో ద్వారా న్యాయం చేస్తుందని నటన రాకపోయినా అలా నెట్టుకువేస్తుంది అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: