సినిమాకు గ్లామర్‌ హీరోయిన్లే.. అదే హీరోయిన్‌ గ్లామర్‌ షోకు మరింత ముందుకు వస్తే.. ఇక థియేటర్లలో సెగలు పుట్టాల్సిందే. అలా వెడింతెర మీద రచ్చ చేసిన అందాల భామలు టాలీవుడ్ బాలీవుడ్‌లలో ఎంతో మంది ఉన్నారు. స్ట్రాప్‌ లెస్‌ గౌన్‌, జంప్‌ సూట్‌, లెహంగా, బికినీ, మోనాకిని, స్విమ్ సూట్‌ ఇలా పేరేదైన అందాల భామలు అందాల ఆరబోతకు ఇదే అసలైన అస్త్రాలు. ఇలా రకరకాల డ్రస్సుల్లో గ్లామర్ షో చేస్తున్న ముద్దుగుమ్మలు టాలీవుడ్ బాలీవుడ్‌లలో చాలా మందే ఉన్నారు.

 

గతంలో సినిమాల్లో పెద్ద పెద్ద హీరోయిన్లు బికినీ ధ‌రించేందుకు పెద్ద‌గా ఇంట్రస్ట్ చూపించే వారు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. అందాల ఆరబోతకు భామలు సై అంటున్నారు. అవ‌కాశాలు రావాలంటే, క్యారెక్ట‌ర్ డిమాండ్ చేస్తే.. ఏ పాత్ర‌కైనా రెడీ అంటున్నారు కొంద‌రు హీరోయిన్లు. అందుకు బికినీ వేసేందుకు కూడా సై అంటున్నారు.

 

గతంలో నయనతార, అనుష్క వంటి హీరోయిన్లు బిల్లా వంటి సినిమాల్లో ఇలాంటి బికినీ షో చేశారు. అయితే అనుష్క ఇప్పుడు గ్లామర్‌ షోకు దూరంగా ఉంటోంది. కానీ నయనతార మాత్రం సినిమాను బట్టి క్యారెక్టర్ డిమాండ్‌ను బట్టి స్కిన్‌ షోకు సై అంటోంది. కాంట్రవర్సియల్ బ్యూటీ తాప్సీ కూడా జుడ్వా 2లో బికినీలో త‌న సోయగాల‌ను ఆరబోసింది. ఆ ఫొటోల‌ను ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో రచ్చ అయ్యింది. అయితే ఈ విషయంలో నా బాడీ నా ఇష్టం నేను చూపిస్తే నీకేంటి అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

 

ఇక తెలుగమ్మాయి ఈషా రెబ్బ కూడా చిన్న సినిమాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. కానీ ఈ మధ్య అవకాశాలు తగ్గడంతో తనలోని మరో యాంగిల్ చూపించడానికి రెడీ అయ్యింది. హాట్ హాట్ స్పైసీ బికినీతో తన అభిమానులతో పాటు, ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అంటోంది. అయితే కాస్త హాట్ సీన్స్‌ లో నటించినా ఓ రేంజ్‌లో గ్లామర్‌ షో చేసే ఛాన్స్ మాత్రం ఈ భామ ఇంకా దక్కలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: