కరోనా కారణంగా ప్రతీ ఒక్కరూ ఇళ్ళకే పరిమితమైన ఈ వేళ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మోషన్ పోస్టర్ ని వదిలి మనలో ఆశలు కలిగించాడు. మోషన్ పోస్టర్ అందరికీ బాగా నచ్చింది. నీరు నీప్పు కాన్సెప్ట్ తో ఉన్న ఈ పోస్టర్ చాలా కొత్తగా అనిపించింది. మోషన్ పోస్టర్ ఇచ్చిన ఆనందం ఇంకా ఉండగానే రాజమౌళి మరో ఆనందాన్ని పంచడానికి వచ్చేశాడు. నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ని వదిలాడు.

 

కొమరం భీమ్ గా చేస్తున్న ఎన్టీఆర్ రామరాజుగా చేస్తున్న రామ్ చరణ్ కి ఇచ్చే గిఫ్ట్ గా దీన్ని అభివర్ణించాడు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో నిమిషం కంటే ఎక్కువ సేపు ఉన్న వీడియోని రివీల్ చేశాడు రాజమౌళి. అల్లూరి సీతారామరాజుని పరిచయం చేసిన భీమ్ తన వాయిస్ ఓవర్ తో ఆశ్చర్యపరిచాడు. ఐదుభాషల్లో రిలీజ్ చేసిన ఈ వీడియోకి నాలుగుభాషల్లో వాయిస్ ఓవర్ ని అందించాడు ఎన్టీఅర్.

 

తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో వాయిస్ ని అందింది ఆహా అనిపించాడు. తెలుగులో ఎన్టీఆర్ కి ఉన్న పట్టు అందరికీ తెలిసిందే. ఏ పదాన్ని ఎలా పలకాలి. ఎక్కడ హై పిచ్ లోకి వెళ్ళాలి. ఎక్కడ లోపిచ్ లో చెప్పాలి అనేది ఎన్టీఆర్ కి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. అయితే తెలుగులోనే కాదు మిగిలిన మూడు భాషల్లో ఎన్టీఆర్ అద్భుతంగా చెప్పాడు. 

 

నాలుగు భాషల్లోనూ అదే తన భాష అన్నంత స్పష్టంగా పలకడం ఆశ్చర్యం. బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ హిందీ డిక్షన్ విషయంలో ఎన్టీఆర్ ని అభినందించాడు కూడా. అంత పర్ ఫెక్ట్ గా ఉంది మారి ఎన్టీఆర్ హిందీ డైలాగ్స్. ఈ  వాయిస్ ఓవర్ ని విన్న ప్రతీ ఒక్కరూ సినిమాలోనూ ఎన్టీఆరే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: