జబర్దస్త్ వల్ల అనసూయ ఎంత పాపులర్ అయ్యింది అన్నది అందరికి తెలిసిందే. ఏడేళ్లుగా ఆ షోకి యాంకర్ గా కొనసాగుతూ సక్సెస్ ఫుల్ కెరియర్ అందుకుంది. ఆ షోలో కమెడియన్లు చేసే కామెడీతో పాటుగా అనసూయ చేసే అందాల విందు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. పెళ్ళై ఇద్దరు పిల్లలున్నా సరే అమ్మడు ఆ విషయంలో తగ్గేది లేదు. బుల్లితెర మీద అప్పట్లో ఉదయభాను హాట్ గా కనిపించి ఆడియెన్స్ ను అలరించేది అయితే ఉదయభాను స్కిన్ షో విషయంలో కొన్ని పరిమితుల్లో ఉండేది కానీ అనసూయ మాత్రం అడ్డు అదుపు లేని అందాల విందు చేస్తుంది. 

 

అదే ఆమెకు బాగా మైలేజ్ వచ్చేలా చేసింది. ఇప్పటికి అనసూయ తన స్కిన్ షోతో జబర్దస్త్ కు మంచి క్రేజ్ వచ్చేలా చేస్తుంది. యాంకర్ లలో అనసూయ చేసే హంగామా అంతా ఇంతా కాదు.. యాంకర్స్ లో అనసూయ కొత్త క్రేజ్ తీసుకొచ్చింది. బుల్లితెర మీద అలా అందాలను గుమ్మరిస్తున్న ఈ అమ్మడు వెండితెర మీద కూడా ఛాన్సులు అందుకుంటుంది. అయితే స్మాల్ స్క్రీన్ పై ఎక్స్ పోజింగ్ లో రెచ్చిపోయే అనసూయ సిల్వర్ స్క్రీన్ పై మాత్రం చాలా మంచి పాత్రల్లో నటిస్తుంది. రంగస్థలమో రంగమ్మత్త పాత్రలో అనసూయ నటన అందరిని మెప్పించింది. 

 

వెండితెర మీద స్పెషల్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న అనసూయ వచ్చిన ప్రతి ఆఫర్ చేయకుండా పాత్రకు ప్రాధాన్యత ఉన్నదే చేస్తూ వస్తుంది. స్మాల్ అండ్ సిల్వర్ రెండిటిలో అనసూయ హవా ఇంకొన్నాళ్ళు కొనసాగేలా ఉంది. ప్రస్తుతం సినిమాల్లో సైడ్ రోల్స్ మాత్రమే చేస్తున్న అనసూయ లీడ్ రోల్ ఛాన్స్ వచ్చినా చేసేలా ఉంది అనసూయ తర్వాత రష్మి కూడా బుల్లితెర ఆడియెన్స్ కు అందాల విందు అందిస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: