హీరోయిన్‌ అంటే గ్లామర్ డాల్ అన్న పేరు ఉంది. హీరోయిన్‌ కెరీర్ ఎక్కువ రోజులు వెండితెర మీద కొనసాగాలంటే స్కిన్‌ షో చేయాల్సిందే అని భావిస్తున్నారు. కానీ ఫార్ములాను బ్రేక్‌ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఆ ముద్దుగుమ్మలు స్కిన్‌ షో చేసేందుకు నో చెప్పి అవకాశాలు వదులుకున్న అందాల భామలు కూడా చాలా మందే ఉన్నారు. అలా అవకాశాలు పోయినా గ్లామర్‌ షఓ చేయకుండా సక్సెస్‌ సాధించిన భామలు చాలా మందే ఉన్నారు.

 

ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సిన హీరోయిన్‌ కీర్తి సురేష్. కెరీర్‌ స్టార్టింగ్ నుంచి ఈ భామ హోంలీ క్యారెక్టర్లే ఎంచుకుంటుంది. తెలుగు ఇండస్ట్రీ అయినా తమిళ ఇండస్ట్రీ అయిన స్కిన్‌ షోకు మాత్రం ఒప్పుకోలేదు కీర్తి. కేవలం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చింది. ఆ నటనతోనే మహానటి సినిమాతో ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది. సినిమాల్లోనే కాదు ప్రైవేట్‌ ఫంక్షన్స్‌ లోనూ ట్రెడిషనల్‌ డ్రెస్‌లోనే కనిపిస్తుంది.

 

ఇదే బాటలో సక్సెస్‌ సాధిస్తున్న మరో భామ సాయి పల్లవి. వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ మొకాళ్ల పైకి ఇంత వరకు ఎప్పుడూ డ్రస్‌ వేసుకోలేదు. ఫిదా సినిమాల్లో కేవలం ఒక్క సీన్‌ కోసం స్కిన్‌ టైట్ డ్రెస్‌లో కనిపించింది సాయి పల్లవి. స్కిన్‌ షో, క్యారెక్టర్ల ఎంపికలో తనకు నచ్చినట్టే ఉండే సాయి పల్లవి తలపొగరన్నపేరు కూడా ఉంది.

 

స్కిన్‌ షోకు దూరంగా ఉంటూనే సక్సెస్ అవుతున్న మరో అందాల భామ నివేదా థామస్‌. ఇటీవల దర్బార్ సినిమాలో సూపర్బ్ పర్ఫామెన్స్‌ తో ఆకట్టుకున్న నివేదా, ఇంత వరకు గ్లామర్‌ రోల్స్‌లో కనిపించలేదు. కమర్షియల్ సినిమాల్లో నటించినా స్కిన్‌  షోకు మాత్రం దూరంగానే ఉంది. కమర్షియల్ స్టార్‌ గా ప్రూవ్ చేసుకునే కన్నా.. విలక్షణ నటిగా ప్రూవ్ చేసుకునేందుకే కష్టపడుతోంది నివేదా.

మరింత సమాచారం తెలుసుకోండి: