రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పోస్టర్ వచ్చిన రెండు రోజుల్లోనే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ లో రామరాజుని పరిచయం చేశాడు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తొ వచ్చిన ఈ వీడియో ట్రెండింగ్ లో నడుస్తుంది. అయితే రామ్ చరణ్ ఫస్త్ లుక్ అనగానే ఎక్కువ ఆసక్తి రామ్ చరణ్ అభిమానులకే ఉంటుంది.

 


కానీ వీడియో విడుదల అయ్యాక గానీ తెలియలేదు అది ఎన్టీఆర్ అభిమానులకి కూడా ట్రీటే అని. రామ్ చరణ్ ని ఎన్టీఆర్ వాయిస్ తో ఎలివేట్ చేయడం హైలైట్. ముఖ్యంగా ఎన్టీఆర్ పలికిన డైలాగులు ప్రతీ ఒక్కరికీ గూస్ బంప్స్ తెప్పించాయి. నా అన్న మన్నెందొర అన్నప్పుడు ఒకరకమైన ఉద్విగ్నత కలిగింది. ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి అని పలికేటపుడు ఆ వాయిస్ లోని గాంభీర్యానికి ప్రతీ ఒక్కరూ ఫిదా అయ్యారు.

 


వీడియోలో రామ్ చరణ్ లుక్ ని చూసిన వాళ్ళు ఎంత ఆశ్చర్యపోయారో ఎన్టీఆర్ వాయిస్ ని విన్న వారు కూడా అంతలా ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఫస్ట్ లుక్ అనగానే ఏదో ఒక ఫోటోని వదలడం మాత్రమే తెలిసిన ప్రేక్షకులకి చాలా కొత్తగా రామరాజుని పరిచయం చేశాడు రాజమౌళి. అంతే కాదు రామ్ చరణ్ అభిమానులనే కాదు ఎన్టీఆర్ అభిమానులని కూడా సంతృప్తి పరిచాడు.

 

ఇద్దరూ హీరోలు నటించే చిత్రాల్లో ఎవరో ఒక హీరో అభిమానులు కొంత నిరుత్సాహపడుతుంటారు. కానీ అలాంటి అవకాశమే ఇవ్వలేదు రాజమౌళి. ఫస్ట్ లుక్ కే ఇంతలా బ్యాలన్స్ చేశాడంటే ఇక సినిమాలో ఎంత బ్యాలన్స్ చేస్తాడో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం అందరూ మే 20వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆ పుట్టినరోజు మరి. రామరాజు భీమ్ కి ఎలాంటి గిఫ్ట్ ఇస్తాడో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: