కరోనా వైరస్ నిజమైన సామ్యవాదిగా మారిపోయింది. బ్రిటన్ ప్రధానమంత్రి దగ్గర నుండి అతి సామాన్యుడి వరకు ఇలా ఎవర్ని వదిలి పెట్టకుండా కరోనా రియల్ సోషలిస్ట్ గా తన పని తాను చేసుకుపోతూ ఈ ప్రపంచ వినాశానికి తన వంతు పాత్రను అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. 


ప్రస్తుతం ఎవరికి ఎంత ఆస్థి ఉంది వారి ఇంటిలో ఎన్ని విలాసవంతమైన కార్లు ఉన్నాయి వారు ఉండే విలాసవంతమైన భవనాలు ఎన్ని వందల కోట్ల విలువ అన్న విషయమై చర్చలు జరగడం లేదు. ప్రస్తుతం అత్యంత ధనవంతుల దగ్గర నుండి సామాన్యుడి వరకు తన ఇంటిలో కనీసం ఒక నెల రోజులకు సరిపడే నిత్యవసర వస్తువులు ఉన్నాయా లేదా అన్న దృష్టిలో మాత్రమే ప్రజలు ఉంటున్నారు. 


ఈ పరిస్థితికి తనకు కూడ ఎటువంటి మినహాయింపు లేదు అన్న విషయం అందరికీ తెలిసే విధంగా అల్లు అర్జున్ ఒక డిపార్ట్మెంట్ స్టోర్స్ లో నోటికి మాస్క్ వేసుకుని చేతికి గ్లోజస్ తొడుక్కుని ఒక స్టోర్స్ లో వస్తువులు కొనుక్కుంటూ సందడి చేస్తున్న ఫోటో మీడియాకు వైరల్ గా మారింది. సాధారణంగా అల్లు అర్జున్ లాంటి సెలెబ్రెటీలు ఇలాంటి సాధారణ డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో కనిపించరు.


వాస్తవంగా బన్నీ బయటకు వస్తే చాలు వందల సంఖ్యలో క్షణాలలో అతడి చుట్టూ జనం చేరిపోతారు. అయితే ఈ పరిస్థితికి భిన్నంగా బన్నీ తాను ఒక్కడే ఆ స్టోర్స్ లో తనకు కావలసిన నిత్యావసర వస్తువులు కొనుక్కుంటూ కనిపించినా కరోనా భయాలతో బన్నీని కూడ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటి వరకు రియల్ సోషలిస్టు శంకరాచారి అంటూ మన హైందవ ధర్మం చెపుతూ ఉండేది. అయితే కరోనా ముందు శంకరాచారి సోషలిస్ట్ సిద్ధాంతాలు కూడ సరిపోవు అన్నవిషయాన్ని బన్ని ఫోటో రుజువు చేస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనితో బన్ని కూడ సామాన్యుడిగా మారిపోయాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: