వెండితెర మీద అవకశాల కోసం చాలా మంది తారలు సోషల్ మీడియానే ఎంచుకుంటున్నారు. అందుకే చాలా మంది అందాల భామలు తన సోషల్ మీడియా పేజ్‌ లో హాట్ హాట్‌ ఫోటలను పోస్ట్ చేస్తూ సెగలు రేపుతుంటారు. అలా సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న అందాల భామలు చాలా మందే ఉన్నారు. వీరికి అవకాశాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియా ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్‌ లో ఉంది. ఈ లిస్ట్ లో సౌత్ నుంచి వెళ్లిన స్టార్స్ కూడా ఉండటం విశేషం.

 

ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సిన భామ ఇలియానా. సౌత్ లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే బాలీవుడ్‌ మీద ఆశలతో ముంబై వెళ్లిన ఈ భామ అక్కడ అవకాశాలు దక్కకపోవటంతో ఫాం కోల్పోయింది. అయితే వెండితెర మీద పెద్దగా అవకావాలు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. బికినీ ఫోటో షూట్ లతో అలరిస్తోంది.

 

సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న మరో అందాల భామ ప్రియాంక చోప్రా. పెళ్లికి ముందు కాస్త పద్దతిగానే ఉన్న ఈ భామ పెళ్లి తరువాత రెచ్చిపోతుంది. ముఖ్యంగా ఫిలిం ఫంక్షన్స్‌ లో మరింత గ్లామర్స్‌ గా కనిపిస్తున్న ఈ బ్యూటీ ఆ ఫోటోలను తన సోషల్ మీడియ పేజ్‌లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.

 

బ్రిటీష్ భామ అమీ జాక్సన్‌ కూడా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. సౌత్‌  తో పాటు బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన ఈ భామ గ్లామర్‌ షోకు ఏ మాత్రం వెనకాడదు. ఇటీవల అమ్మ అయిన ఈ భామ ఆ తరువాత కూడా సోషల్ మీడియాలో రచ్చ కొనసాగిస్తోంది. ఈమె కాదు. అమీషా పటేల్‌, రియాసేన్‌, సుస్మితా సేన్‌, లిసా హెడెన్‌ లాంటి అందాల భామలు చాలా మంది ఆన్‌లైన్‌లో వేడి పుట్టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: