కరోనా వ్యాధి నివారణ కోసం ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలకు తన వంతు సహాయంగా 2 కోట్లు విరాళం ఇచ్చిన పవన్ ఇప్పడు కరోనా సమస్య వల్ల వచ్చిన షూటింగ్ గ్యాప్ తో తన ఇంటివద్ద కూర్చుని చేస్తున్న సాహసం పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలను లైన్ లో పెట్టి నటిస్తున్న పవన్ క్రిష్ దర్శకత్వం పిరియాడిక్ జోనర్‌ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా  తీస్తున్న ఈ సినిమా కథ అంతా కోహినూర్ డైమండ్ చుట్టూ తిరుగుతుంది.   

 

భారీ బడ్జెట్ హై టెక్నికల్ వ్యాల్యూస్‌ తో రూపొందబోతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తోంది.  పవన్ నటిస్తున్న ఆ రెండు పాత్రలలో ఒకటి రాబిన్ హుడ్ తరహా రోల్ కాగా మరోక పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.  ‘తీన్‌ మార్' తర్వాత పవన్ మరోసారి  రెండు పాత్రలో నటిస్తున్న ఈమూవీకి   సంబంధించి పవన్ ఒక ఊహించని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో ఉండే రెండు పాత్రల్లో ఒకదాని కోసం లావుగా మరో దాని కోసం సన్నగా కనిపించాలట. ఇప్పుడు షూటింగ్‌కు విరామం దొరకడంతో సన్నబడడం కోసం పవన్  ఇంట్లోనే దాదాపు ఐదారు గంటలపాటు  ఎక్స్ సైజ్ లు చేస్తున్నాడని  సమాచారం.

 

ఇదే సమయంలో ఈ సినిమా కోసం కత్తిసాము గుర్రపు స్వారీలో సైతం పవన్ కల్యాణ్ శిక్షణ తీసుకుంటున్నాడని అంటున్నారు. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన టెక్నిషియన్స్ పవన్ గెస్ట్ లోఉన్న నేపధ్యంలో ప్రస్తుతం ప్రభుత్వాలు అనుసరిస్తున్న షట్ డౌన్ కారణం గా పవన్ కు దొరికిన ఖాళీని ఉపయోగిస్తూ పవన్ కు కత్తిసాము విషయంలో కోచింగ్ ఇస్తున్నట్లు టాక్.   

 

మండు వేసవి అయినప్పటికీ ఏమాత్రం అలసటను లెక్కచేయకుండా పవన్సినిమా కోసం కాస్త సన్నపడటమే  కాకుండా మధ్యలో దొరికిన గ్యాప్ లో ‘వకీల్ సాబ్’ లోని తన పాత్రకు ఇప్పటివరకు జరిగిన షూటింగ్ కు సంబంధించి డబ్బింగ్ కూడ పూర్తి చేసి టాప్ హీరోలు అంత రెస్ట్ తీసుకుంటూ ఉంటె పవన్ తన సినిమాల కోసం తెగ కష్ట పడుతూ ఉండటం సంచలన వార్తగా మారింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: