సిల్క్ స్మిత.. నాటితరం నుంచి నేటితరం వరకు ఈ పేరు తెలియని వారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు ప్రేక్షకులకు మైకం తెప్పిస్తూ తన అంచందాలతో కైపెక్కించిన అలనాటి తార  సిల్క్ స్మిత. మొదటి చిత్రం తమిళంలో వండి చక్రం (బండి చక్రం). 1979లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్. ఈ పాత్రకు విశేష ఆదరణ లభించడంతో.. ఆమె తన పేరును సిల్క్ స్మితగా మార్చుకుంది.తర్వాత చాలా సినిమాలో నటించి అందరిని మెప్పించింది. 

 

200పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ  చిత్రాలలో నటించింది. అనేక సినిమాలలో ఆమె ప్రత్యేక గీతాలు, శృంగార నృత్యాలు కూడా చేసింది. ఈ శృంగార నృత్యాలు అమెకు అత్యంత జనాదరణను తెచ్చి పెట్టాయి.  తెలుగులో "బావలు సయ్యా, మరదలు సయ్యా" పాట  చూస్తే చాలు సిల్క్ స్మిత అంటే ఏంటో అందరికి తెలిసిద్ధి.  బావలు సై అంటే చాలు కుర్రాళ్ళు, ముసలి ముతక అందరు సై సై అనేవాళ్లట. సిల్క్ స్మిత కైపు ఎక్కించే చూపు, నాభి అందాలు, నవ్వు అన్ని స్మిత కి ప్రేత్యేక ఆకర్షణగా నిలిచాయి.

 

అప్పట్లో ఎక్సపోసింగ్  చేసే హీరోయిన్స్ లో స్మిత ఒకరు. ఎక్కువ చిత్రాలలో ఆమె ఇతరులను వలలో వేసుకొనే అమ్మాయిగా, నర్తకిగా, ప్రేక్షకులను ఉర్రూతలూగించే నృత్యాలతోను, కామాన్ని కలిగించే దుస్తులతోను, ముదురు అమ్మాయిలాగా కనిపించింది. అయితే "సీతాకోకచిలుక వంటి కొన్ని చిత్రాలలో నటనాప్రధానమైన పాత్రలలోను మెప్పించింది. ఆమె స్టార్ డమ్‌ లో ఉన్నపుడు రెమ్యూనరేషన్ డిఫరెంటుగా ఉండేది. సినిమా రెమ్యూనరేషన్ కాకుండా ఏ రోజు రెమ్యూనరేషన్ ఆరోజే. ఆమె డేట్స్ కావాలంటే 4 లేదా 5 లక్షలు పట్టుకుని ఉదయం ఇంటికి వచ్చి మరి ఆమెను తీసుకెళ్లేవారు.

 

హీరోయిన్స్ కి ఉన్న డిమాండ్ ఉండేది సిల్క్ స్మితకి. ఐటమ్ సాంగ్స్ లో ప్రేత్యేక ఆకర్షణ సిల్క్ స్మితది. ఏ సినిమాలో నటించిన గాని ఆ సినిమా హిట్ అయ్యేది. సిల్క్ స్మితకి మద్యం తాగే అలవాటు ఉంది. ఆ  బలహీనత వల్లనో లేక మరే కారణాల వల్లనో కానీ స్మిత జీవితం అర్థంతరంగా ముగిసిపోయింది. ఒక మంచి నర్తకిని సినీ ఇండస్ట్రీ కోల్పోయింది. కానీ స్మితని మాత్రం ఎనేళ్ళయినా గాని ప్రేక్షకులు మర్చిపోరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: