పాన్ ఇండియా బిగ్గెస్ట్  మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ (రౌద్రం,రణం,రుధిరం) నుండి మూడు రోజుల వ్యవధిలో బ్యాక్ టు బ్యాక్ సప్రైజ్ లు వచ్చాయి. అందులో మొదటి సప్రైజ్ గా ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో,మోషన్ పోస్టర్ ను విడుదలచేయగా నిన్న రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్ ను విడుదలచేశారు. ఇందులో విశేషం ఏంటంటే..ఈ టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్  ఓవర్ ఇవ్వడం.. చరణ్ స్క్రీన్ ప్రజెన్స్, రాజమౌళి టేకింగ్ కు తోడు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తోడవడం తో ఈ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో ఈ టీజర్ విడుదలకాగా  ఒక్క మళయాలం లో తప్ప మిగితా నాలుగు భాషల్లో ఎన్టీఅరే వాయిస్ ఓవర్ ఇచ్చాడు. 
 
తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అయితే  కన్నడ ,తమిళ, హిందీ భాషల్లో కూడా తనకు ఎంత పట్టుందో ఈ వీడియో ద్వారా తెలియజేశాడు. ముఖ్యంగా  బేస్ వాయిస్ తో హిందీ వెర్షన్ టీజర్ కు ఇచ్చిన వాయిస్ ఓవర్ సూపర్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.400కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న విడుదలకానుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: