మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఓ అవకాశం వస్తేనే మహా అదృష్టంగా భావిస్తారు నటీనటులు. చిరంజీవి కి ఉన్న ఇంపాక్ట్, క్రేజ్, ఫ్యాన్ బేస్ అలాంటిది. ఆయన సినిమాలో చిన్న పాత్ర వస్తే వారికి రికగ్నిషన్ తో పాటు మంచి గుర్తింపు వస్తుంది. ఇంకా చెప్పాలంటే చిరంజీవితో పని చేయడం.. చిరంజీవి సినిమాలో అవకాశం రావడం గౌరవంలా భావిస్తారు. అలాంటిది ఓ యాక్ట్రస్ కి ఏకంగా చిరంజీవితో డ్యాన్స్ చేసే అవకాశం వస్తే ఇక వారి ఆనందానికి హద్దేముంటుంది. యాంకర్ అనసూయకు ఇటువంటి బంపర్ ఆఫరే దక్కిందని సమాచారం.

 

 

చిరంజీవి 152వ మూవీ ఆచార్యలో అనసూయకు చిరంజీవితో కలిసి స్టెప్పులేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే అనసూయకు ఆచార్యలో అవకాశం వచ్చిందనే వార్త రౌండ్ అవుతోంది. అయితే సినిమాలో అవకాశం వేరు.. చిరంజీవితో కలిసి స్టెప్పులేయడం వేరు. అదీ.. హీరోయిన్ అయితే డ్యాన్స్ చేయాల్సిందే. కానీ అనసూయ హీరోయిన్ కాదు. అయినా రంగమ్మత్తలోని డ్యాన్స్, ఎనర్జీ చూసి చిరంజీవితో ఓ స్పెషల్ సాంగ్ డిజైన్ చేశాడట దర్శకుడు కొరటాల శివి. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం సర్కిల్స్ లో బాగా రౌండ్ అవుతోంది. ఇదే నిజమైతే రంగస్థలంలో నటనతో మెప్పించిన అనసూయ.. ఇప్పుడు ఆచార్యలో స్టెప్పులతో అలరించనుంది.

 

 

జబర్దస్త్ యాంకర్ గా అనసూయకు ఎంతో పేరు. ఆ షోలో అప్పుడప్పుడూ స్టెప్పులేస్తుంది. ఇప్పటికే నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో, సాయిధరమ్ తేజతో విన్నర్ లో ఓ సాంగ్ చేసింది. ఎన్ని పాటలు చేసినా మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులేయడం మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఈ వార్తపై అఫిషియల్ న్యూస్ మూవీ టీమ్ గానీ.. అనసూయ గానీ రివీల్ చేయాల్సిందే. ఆచార్యలో ఇప్పటికే రెజీనాతో ఓ స్పెషల్ సాంగ్ ఉండగా ఇది రెండో స్పెషల్ సాంగ్ అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: