పాత సినిమాల్లో ఐటెమ్‌సాంగ్స్ అంటే అప్ప‌ట్లో దానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక‌ప్పుడు డాన్స‌ర్‌గా చేసిన న‌టి జ‌య‌మాలిని, అప్ప‌ట్లో దాదాపుగా చాలా సినిమాల్లో ఆమె స్పెష‌ల్ సాంగ్ త‌ప్ప‌నిస‌రిగా ఉండేద‌ని చెప్పాలి. ఇక ఆ సాంగ్స్‌లో ఆమె ఎక్స్‌పోజింగ్ చేసిన‌ప్ప‌టికీ.. ఆమె వేసే స్టెప్సుల‌కి ఆమె అందానికి అప్ప‌ట్లో ఆమెకున్న క్రేజ్ అబ్బో అద‌ర‌హో  అనే చెప్పాలి. ఈమె అన్ని భాష‌ల్లో క‌లిసి దాదాపు 600 చిత్రాల్లో న‌టించింది. శృంగార నృత్య తార‌గా ప్ర‌సిద్ధి చెందింది. ఈమె సోద‌రి జ్యోతిల‌క్ష్మి కూడా సుప్ర‌సిద్ధ‌మైన సినీ న‌టి. అనేక శృంగార నృత్యాలు చేసి ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించింది.

 

ఈమె అస‌లు పేరు అలివేలుమంగ‌. ఆమె త‌ల్లి వెంక‌టేశ్వ‌ర‌స్వామి భ‌క్తురాలు కావ‌డంతో ఈమెకు ఆ పేరు పెట్టుకుంది. ద‌ర్శ‌కులు విఠ‌లాచార్య ఈమెకు ఆ పేరు చాలా మోటుగా ఉంద‌ని ఆయ‌న జ‌య‌మాలిని అని పేరు పెట్టారు. ఈమె మేన‌త్త టి.ఆర్ రాజకుమారి త‌మిళంలో అగ్ర‌న‌టి. జ‌య‌మాలిని ప‌న్నెండేళ్ళ వ‌య‌సులో ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. అది కూడా ఓ త‌మిళ చిత్రంలో న‌టించింది. ఆ చిత్రం తర్వాత ఆమెకు ఒక ఐట‌మ్ సాంగ్‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది కానీ ఆమె అప్ప‌ట్లో చాలా స‌న్న‌గా ఉండేది దాంతో ఆ సాంగ్‌లో న‌టించ‌డానికి ఆలోచించింది. చివ‌రికి ఆ పాట‌లో చేసింది.

 

అయితే అప్ప‌టికే ఆమె సోద‌రి జ్యోతిల‌క్ష్మి ఐటెమ్ సాంగ్స్‌లో న‌టిస్తోంది. ఇక జ‌య‌మాలిని మంచి క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్ ఆమె భ‌ర‌త‌నాట్యం కూడా నేర్చుకుంది. సినిమాల నుంచి విర‌మించుకున్నాక ఒక చెన్నై వ్య‌క్తిని వివాహం చేసుకుని సెటిల్ అయింది. ఇక 2008లో ఆమె జీవిత చ‌రిత్ర రాయ‌డం కోసం జ‌య‌మాలిని ఒక రైట‌ర్ కోసం వెతికిన‌ట్లు స‌మాచారం. ఆమె ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో  న‌టించింది. ఆమె స్పెప్పు వేసిందంటే చాలు ప‌క్క‌నున్న కుర్రాళ్ళు అవాక్క‌య్యేవారు. ముఖ్యంగా ఆమె ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించిన చిత్రాలు ఔరా అనిపించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: