అనుష్క మొదట్లో కొంత గ్లామరస్, రొమాంటిక్ పాత్రల్లో నటించినా రాను రాను మాత్రం సినిమాల్లో తన పాత్ర పరిధి మేరకు అవసరమైన చోట ఎక్స్ పోజింగ్ చేస్తుంది. అయితే ఎక్స్ పోజింగ్ అంటే వల్గర్ గా లేకుండా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా కొన్ని క్యారెక్టర్స్ లో అనుష్క నటించి, నేటి హీరోయిన్స్ లో ఎక్స్ పోజింగ్ కి కొత్త అర్ధాన్ని తెచ్చిందనే చెప్పాలి. సూప‌ర్ చిత్రంతో మంచి ఎక్స్‌పోజింగ్‌కి కొత్త అర్ధం తీసుకొచ్చింది అనుష్క‌. ఈ భామ కూడా అవ‌స‌రం మేర‌కు మొద‌ట్లో కొన్ని క్యారెక్ట‌ర్స్ లో ఎక్స్‌పోజింగ్ చేసినా కూడా ఆ త‌ర్వాత ఆమె న‌టించే చిత్రాల్లో ఆమె పాత్ర‌కి ప్రాధాన్య మున్న చిత్రాల్లో న‌టించి తెలుగువారి గుండెల్లో చెద‌ర‌ని ముద్ర వేసుకుంది ఈ భామ‌. 

 

ఈమె ముద్దు పేరు స్వీటీ అని చెప్పాలి. అనుష్క ఆమె  అందాల ప్రదర్శనతో కుర్రకారును ఆమె అంద‌చందాల‌తో క‌ట్టిప‌డేసేది.  వేద చిత్రంలో సరోజగా కవ్వించినా, బిల్లాలో బికినీతో కనిపించినా, విక్రమార్కుడుతో విజృభించినా, రగడతో అందాల రచ్చరేపినా ఆమెకు ఆమె సాటి..ఆమెకు లేరు ఎవ్వ‌రూ పోటీ అన్న‌ట్లు ఉంటుంది ఆమె అందం. మొదట్లో ఇండ‌స్ట్రీల‌కి అడుగు పెట్టాలంటే అనుష్క అందాల ప్రదర్శనికే ఎక్కువ‌గా ప్రయారిటీ ఇచ్చింది. అయితే అరుంధతి నుంచి ఆమె ఇమేజ్ మారింది. అందులో ఆమె అద్బుతంగా నటించిందంటూ మీడియా ప్రశంసించింది. అంతేగాక అనుష్క సైతం తాను కేవలం అరుంధతి చిత్రంతోనే నటనకు అలవాటు పడ్డాను అంటుంది.

 

పాపులారిటీ కోసం మొద‌ట్లో  హాట్ అండ్ సెక్సీగా రెచ్చిపోయిన అనుష్క, ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ పరంగా తన విశ్వరూపం చూపించి అవురా అనిపించుకుంది. అటు అందం, మరో వైపు అభినయంతో ఆమెను మించిన వారు లేరు అన్న‌ట్లు  ఉండేది అనుష్క ఇమేజ్‌. సూపర్  తర్వాత వ‌రుస చిత్రాల్లో ఈ భామ దూసుకుపోయిందని చెప్పాలి. తెలుగులో దాదాపు అంద‌రి హీరోల‌తో న‌టించి మెప్పించింది. అస్త్రం, చింతకాయల రవి, ఒక్క మగాడు వంటి చిత్రాలు చేసినా రాని బ్రేక్ రాజమౌళి విక్రమార్కుడుతో వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: