ప్రపంచంలో ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం మరింత పెరిగిపోతుంది.  ఒక్కో దశ పెరుగుతున్న సమయంలో భారత దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.   ఈ లాక్ డౌన్ వల్ల ప్రజలు బయటకు రాకుండా ఇంటి పట్టున ఉండాలని దానితో కొంతలో కొంతైనా ఈ కరోనా భారిన పడకుండా జాగ్రత్త తీసుకున్నవాళ్లం అవుతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి.  అయితే చాలా మంది చేతులు శుభ్రం చేసుకోవాలి..శానిటైజర్స్ వాడాలని అంటున్నారు.

 


కాకపోతే వీటిని ఎప్పుడు ఎలా వాడాలో అన్న విషయంపై చాలా మంది జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రతి చిన్న విషయానికి సబ్బుతో రుద్దుకున్నా.. ఇష్టమొచ్చినపుడు శానిటైజర్స్ వాడితే ఎంత వరకు లాభం ఉంటుంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వ్యక్తిగత దూరం, క్లీన్ గా ఉండడం,చుట్టున్న పరిసరాలను క్లీన్ గా ఉంచుకోవడమే మందు. ఇంతకుమించి ప్రస్తుతం కరోనాకు మందు లేదనే చెప్పవచ్చు. 

 


సబ్బుతో చేతులు ఎప్పుడు కడగాలి? 

- ఆహారం తినడానికి లేదా వండుకునే ముందు, తర్వాత

అనారోగ్యంతో ఉన్న వ్యక్తి సంరక్షణలో ఉన్నప్పుడు

- బాత్రూమ్ ఉపయోగించినా లేదా క్లీన్ చేసిన తర్వాత

- దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు

- ఏదైనా జంతువును తాకిన తర్వాత

- చెత్తను తాకినప్పుడు లేదా చేతులు మురికిగా కనిపించినప్పుడు

 


శానిటైజర్స్ ను ఎప్పుడు వాడాలి?

- హాస్పిటల్, నర్సింగ్ హోమ్ వంటి వాటిని విజిట్చేసే ముందు, తర్వాత

-సబ్బు, నీరు అందుబాటులో లేనప్పుడు కనీసం

-60 శాతం ఆల్కహాల్‌ ఉండే శానిటైజర్ ను వాడండి.

-బహిరంగ ప్రదేశాల్లో సబ్బు, నీరు అందుబాటులోలేనప్పుడు

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: