ప్రస్తుతం దేశమంతా కరోనా వైరస్ భయంతో వణికిపోతోంది. ఈ భయంలో ఉన్న  ప్రజలకు ప్రభుత్వంతో పాటు ఎందరో సెలబ్రిటీలు, డాక్టర్లు, మేధావులు.. అందరూ ధైర్యం చెప్తున్నారు. కరోనా బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సవివరంగా వివరిస్తున్నారు. ఇందులో అన్ని భాషల సినీ హీరోలు కూడా ఉన్నారు. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఇదే అవేర్ నెస్ తీసుకురావడానికి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయనపై కేసు నమోదయ్యేలా చేశాయట.

 

 

ఇటివల ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ లాల్ మాట్లాడుతూ.. ‘అందరూ చప్పట్లు కొడితే కరోనా వైరస్ దరి చేరదు. కారణం.. రెండు చెతులతో కొట్టే చప్పట్ల వల్ల ఒక రకమైన మంత్రం లాంటి శబ్దం వచ్చి చెడు బ్యాక్టీరియా, వైరస్ చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి.. అందరం ఇలా చప్పట్లు కొట్టి కరోనాను తరిమేద్దాం’ అంటూ మాట్లాడాడు. ఇప్పుడీ వ్యాఖ్యలకు మళయాళీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. నిజానికి ఈ వ్యాఖ్యలు జనతా కర్ఫ్యూకు ముందే మోహన్ లాల్ మాట్లాడినట్టు తెలుస్తోంది. దీనిపై నెట్టింట్లో విమర్శలు రావడమే కాదు.. ఓవ్యక్తి ఏకంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశాడట. ఇప్పుడీ అంశం కేరళలో చర్చనీయాంశం అయింది.

 

 

బాధ్యత గల వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడటం తగదనేది వారి వాదన. ఇటివల కరోనాపై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్లను కూడా ట్విట్టర్ యాజమాన్యం డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు మోహన్ లాల్ మాట్లాడిన వ్యాఖ్యలు కూడా అంతే వివాదానికి దారి తీశాయని సమాచారం. మరి దీనిపై చర్యలు తీసుకుంటారో లేదో తెలియాల్సి ఉంది. ఇండియాలో కరోనా వైరస్ బారిన పడిన రాష్ట్రాల్లో కేరళ రెండో స్థానంలో ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: