టాలీవుడ్ లో కుటుంబ నేపథ్యం నుంచి ఎంతో మంది హీరోలు గా వచ్చారు. విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ కుమార్ లతో పాటు ఆయన కూతురు మంచు లక్ష్మి కూడా నటిగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  అయితే మంచు లక్ష్మి సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నారు.  మంచు విష్ణు ప్రస్తుతం మోసగాళ్ళు సినిమాలో నటిస్తున్నారు.  ఈ మూవీలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఎర్రబస్సు' సినిమాను గురించి ప్రస్తావించాడు. "ఓ రోజున దాసరిగారు పిలిచి 'ఎర్ర బస్సు' సినిమాలో చేయమన్నారు.

 

నాకు కథ తెలియదు .. నేను అడగలేదు .. ఒక్క ప్రశ్న కూడా వేయలేదు .. ఓకే అంకుల్ అన్నాను.  మొదటి నుంచి ఆయన అంటే మా కుటుంబానికి ఎంతో భయం భక్తి ఉంది.  నాన్నగారు ఎంతగానే అభిమానించి ఆరాధించే వ్యక్తి దాసరి నారాయణరావుగారు.  అలాంటి వ్యక్తి వచ్చి ఏరా అబ్బాయి నాతో సినిమా తీస్తావా అన్నపుడు నేను ఎలా కాదంటాను.. ఓకే చెప్పేశాను.  నటుడిగా మా నాన్నకి జీవితాన్నిచ్చింది దాసరి గారే. కెరియర్ ఆరంభంలో నాన్నను ఎంకరేజ్ చేసిందే ఆయన.

 

అలాంటి ఆయన ఇప్పుడు తన సినిమాలో చేయమని అడిగినప్పుడు, చేయాలా వద్దా అని నేను లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే మానవత్వానికి అర్థం లేకుండా పోతుంది. అందుకే పూర్తి విశ్వాసంతో ఆ సినిమా చేయడానికి అంగీకరించాను.  అయితే ఆ మూవీ నా కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయినప్పటికీ నాకు మాత్రం దాసరి గారితో నటించాన్న తృప్తి ఉంది.  సినీ పరిశ్రమలో హిట్ ఫ్లాపులు కామన్.. కానీ మహా దర్శకులు, నటులు అయిన దాసరి గారితో నటించడం అంటే ఎంతో అదృష్టమో నాకు తెలుసు అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: