బీ స్క్వేర్ ఎపుడూ సంచలనమే. బాలయ్య, బీ గోపాల్. టాలీవుడ్ ఇండస్ట్రీ గూబ గుయ్యిమనే హిట్లు ఇచ్చారు. మూడు బ్లాక్స్ బస్టర్లు గోపాల్ బాలయ్యకు ఇచ్చి ఆయన్ని బాక్సాఫీస్ బొనాంజాను  చేశాడు. ఆ తరువాత మరో  బీ యాడ్ అయింది. ఆయనే బోయపాటి శ్రీను. వీరిద్దరి ఫస్ట్ కాంబో సింహా. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది.

 

ఆ తరువాత లెజెండ్ వచ్చి ఇండస్ట్రీలో ఇప్పటికీ చెరిగిపోని రికార్డులు నెలకొల్పింది.  ఇందులో బాలయ్య నటన హైలెట్ అయితే ఈ మూవీలో యాక్షన్ సీన్లు. సెంటిమెంట్ సీన్లు, జగపతి బాబు విలన్ గా అదిరిపోయే యాక్షన్ అన్నీ కలసి లెజెండ్ ని చిరస్థాయిలో నిలబెట్టింది.

 

ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ అయిన డేట్ సరిగ్గా ఇదే రోజు. అంటే 2014 మార్చి 28. ఆ రోజున ఫ్యాన్స్ కి పండుగలా సాగింది. రిలీజైన ప్రతీ చోటా పాజిటివ్ టాక్ తో  బాలయ్య ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోయారు. ఈ మూవీలో బాలయ్య చెప్పిన డైలాగులు ఇప్పటికీ జనం చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి.

 

మూవీ తరువాత అంత పెద్ద హిట్ మళ్ళీ బాలయ్యకు దక్కలేదు. ఇపుడు ఫ్రెష్ గా హ్యాట్రిక్ కాంబోకు బాలయ్య, బోయపాటి బరిలోకి దిగారు. ఈ హ్యాట్రిక్ మూవీ లెజెండ్ ని మించి సెన్షేషన్ క్రియేట్ చేస్తుందని ఆశతో ఫ్యాన్స్ ఉన్నారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి, బోయపాటి మాస్ మసాలా కధలకు బాగా సెట్ అయిందని అంతా అంటారు.

 

ప్రస్తుతం ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారు. పైగా కసి మీద ఉన్నారు. అందువల్ల లెజెండ్ ని తలదన్నే అద్భుతమైన హిట్ ఒకటి ఈ కాంబో నుంచి వస్తుందని అంతా అంచనా కడుతున్నారు. ఏది ఏమైనా 2010లో సింహా, 2014లో లెజెండ్, 2020 కి హ్యాట్రిక్ మూవీతో మళ్ళీ బీ స్క్వేర్ టాలీవుడ్  గర్జించేలా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారని ఆశతో ఫ్యాన్స్ కూడా ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: