ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న కలకలం అంతా ఇంతా కాదు.  ప్రతి నిత్యం దీని గురించి చర్చలే నడుస్తున్నాయి.  దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానకి లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు వారి తాహతను బట్టి పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్ కి డోనేట్ చేస్తున్నారు.  తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.25 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు.  తన శక్తి మేరకు సహాయం చేస్తున్నట్టుగా అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.

 

ప్రతి ఒక్కరూ కూడా ఈ విపత్కర సమయంలో ఆదుకోవాలని పిలుపునిచ్చారు.  ఇటు టాలీవుడ్ సినిమా స్టార్స్ సైతం కరొనాపై పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారు.  కరోనా మహమ్మారి భారిన ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు   భారతీయ వ్యాపార వేత్త రతన్ టాటా ముందుకు వచ్చారు.  కరొనాను ఎదుర్కొనడానికి తన వంతు సహాయంగా రూ.500 కోట్ల రూపాయలు సహాయం అందించారు.  ప్రధాన మంత్రి సహాయ నిధికి ఆయన ఈ మొత్తాన్ని అందజేశారు.   

 

 ఇండియాలో ఇప్పటి వరకు 933 కరోనా కేసులు నమోదయ్యాయి.  20 మరణాలు సంభవించాయి.  ప్రస్తుతం ఇండియా రెండో స్టేజ్ లో ఉన్నది.  మూడో స్టేజ్ లోకి వెళ్ళకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు పోరాటం చేస్తున్నాయి.  భారత ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ కార్యక్రమం విజయవంతం అయ్యే దిశగా అడుగులు వేస్తుండటం విశేషం.  

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: