క‌రోనాపై ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ త‌న‌దైన విల‌క్ష‌ణంతోనే స్పందిచారు. ‘ఇప్పుడు ఏమి చేయాలి కరోనా’ అంటూ ట్విట్ట‌ర్‌లో ప్ర‌శ్నించారు.  ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను..ఏం తోచ‌డం లేదు. సమయం అస్సలు గడవడం లేదని ట్విటర్‌లో రాసుకొచ్చారు. ‘నెలకు 30 రోజులు ఉంటాయని ఎప్పుడూ అనుకునేవాడిని. కానీ వెయ్యి రోజులు ఉంటాయని మొదటిసారి అనిపిస్తోంది. సమయం ముందుకు సాగడం లేదు. కరోనా భయంతో సమయంతో సహా అన్నింటిని ఆపేశారు. ఇప్పుడు ఏమి చేయాలి కరోనా’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండ‌గా లాక్‌డౌన్‌ సందర్భంగా పోలీసులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం మీద కూడా ఆయన సెటైర్లు సంధించారు. 

Always thought every month has some 30 days ..First time realising that it has a thousand days ..Time is just not moving 😳😳😳

ram gopal varma (@RGVzoomin)

భారీ సంఖ్యలో గుంపులు గుంపులుగా ఢిల్లీ-యూపీ సరిహద్దు దాటుతున్న వలస కార్మికుల వీడియోపై కామెంట్‌ చేస్తూ.. ‘హే రామ్‌, హే అల్లా, జీసెస్‌ ఎక్కడ ఉన్నారు’ అంటూ ట్వీట్‌ చేశారు.  ఇదిలా ఉండ‌గా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన పెద్ద‌లంద‌రూ క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. కుటుంబ స‌భ్యుల‌తో కాలం వెళ్ల‌దీస్తున్నారు. కొంత‌మంది కుటుంబ స‌భ్యుల‌తో నిర్భందంగానైనా స‌మ‌యం గ‌డిపేందుకు అవ‌కాశం క‌ల్పించినందుకు క‌రోనా నీకు థాంక్స్ అంటూ పేర్కొంటుండ‌టం గ‌మ‌నార్హం. క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా ప్ర‌తీ ఒక్క‌రూ బాధ్యాతాయుతంగా స్వీయ గృహ‌నిర్బంధంలో ఉండాల‌ని సూచిస్తున్నారు.


 
రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న త‌దుప‌రి చిత్రాల‌కు సంబంధించిన ప్లానింగ్ చేసుకోవ‌చ్చుగా అంటూ ఆయ‌న అభిమానులు, ట్విట్ట‌ర్‌లో ఆయ‌న్నుఫాలో అవుతున్న కొంత‌మంది ఉచిత స‌ల‌హాలు ఇస్తున్నారు. ఇందుకు ఆర్‌జీవీ కూడా త‌న‌దైన శైలిలో స్పందిస్తున్నారు. నా ప‌ని ఏంటో నాకు తెలుసు..మీ ప‌ని మీరు చూసుకోకుండా..నా ప‌నిని..మీప‌నిగా భావించి..ఒక చెత్త‌ప‌ని చేస్తున్నారంటూ ట్విట్ చేయ‌డంతో ఖంగుతిన్నారు. ఎదుటివారికి కౌంట‌ర్ ఇవ్వ‌డంలో ఆర్జీవీకి మించిన ద‌ర్శ‌కుడు లేడ‌నే విష‌యం జ‌గ‌మెరిగిన స‌త్య‌మే. అయితే క‌రోనా పూర్త‌య్యాక ఈ వైర‌స్ ఏదైనా
సినిమా ప్లాన్ చేస్తాడేమో చూడాలి మ‌రి.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: