ఇక ఆర్‌ ఆర్‌ ఆర్‌ సందడి మొదలైనట్టే.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఈ చిత్రం టైటిల్ ఇటీవలే రివీల్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే టైటిల్ రివీల్ చేసిన రాజమౌళి.. మార్చి 27రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఓ వీడియోలు రిలీజ్ చేసింది. రామ్ చరణ్ పుట్టిన రోు కాబట్టి అతని పాత్రను పరిచయం చేసేలా ఈ వీడియో ఉంది.

 

 

ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతా రామ రాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలో రామ్ చరణ్ పాత్రను ఎన్టీఆర్ పాత్ర పరిచయం చేయడం మరో విశేషం. ‘Bheem For Ramaraju‘ పేరుతో చరణ్ పోషిస్తున్న సీతారామ రాజు పాత్రను పరిచయం చేస్తూ విడుదలై వీడియో సోషల్ మీడియాలో రికార్డులు తిరగరాస్తోంది.

 

 

అయితే ఈ వీడియోలో మరో విచిత్రం ఉంది. పాన్ ఇడియా మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన రామ్ చరణ్ పాత్ర పరిచయ వీడియోను కూడా నాలుగు భాషల్లో రిలీజ్ చేశారు. అయితే ఈ నాలుగు భాషల్లోనూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ పైనే వీడియో సాగుతుంది. అన్ని భాషల్లోనూ ఎన్టీఆర్ స్వయంగా సొంత గొంతుతో వాయిస్ ఓవర్ చెప్పడం నిజంగా ఆశ్చర్య పరిచింది.

 

తెలుగు, తమిళ్ , హిందీ, కన్నడం, ఈ నాలుగు భాషల్లోనూ ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చారు. సీతారామ రాజుగా చరణ్ మేకోవర్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్‌లో ఫైర్ అదిరిపోయాయి. అల్లూరి పాత్రలో రామ్ చరణ్ నిప్పులు చెరిగాడనే చెప్పాలి. ఇక సెంథిల్ కుమార్ విజువల్స్, కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్బ్. సీతారామ రాజు పాత్రను పరిచయం చేస్తూ కొమరం భీంగా ఎన్టీఆర్... సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్ చెబుతూ ఉంటే.. రొమాలు నిక్కబొడుచుకున్నాయి. ఒక్క మళయాళంలోనే వేరే వ్యక్తితో వాయిస్ చెప్పించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: