పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న సినిమా 'వకీల్ సాబ్'. హిందీలో మంచి సక్సస్ ని అందుకున్న 'పింక్' సినిమాకి వకీల్ సాబ్ అఫీషియల్ రీమేక్ అన్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మాంచి ఊపుమీదున్న థమన్ సంగీతాన్నిఇవ్వడం తో మ్యూజిక్ పరంగా ఈ సినిమా మీద భారీ గా అంచనాలు నెలకొన్నాయి. ఇక రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. 

 

అంతేకాదు వకీల్ సాబ్ నుండి ఫస్ట్ సాంగ్ 'మగువా మగువా...' విడుదలైంది. కానీ ఈ సాంగ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దానికి తోడు కరోనా ఎఫెక్ట్ కూడా ఈ సాంగ్ మీద బాగా పడింది. మాములుగా అయితే ఈ సాంగ్ బాగున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కి ఉండే మాస్ ఫ్యాన్స్ కి ఈ పాట పెద్దగా ఎక్కడం లేదని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. వాస్తవంగా అయితే ఈ సినిమా కమర్షియల్ సినిమా కాదన్న సంగతి తెలిసిందే. 

 

ఇప్పటికే హిందీ, తమిళ భాషల్లో ఆల్రెడీ చూసేసారు. కాబట్టి తెలుగులో ఎంతవరకు ఈ సినిమాని ఆదరిస్తారో అంటూ చాలా మందిలో సందేహాలున్నాయి. ఈ సందేహాలు కూడా ఇప్పటివి కాదు. పవన్ కళ్యాణ్ కమిటయిన మొదటి రోజునుండే ఉన్నాయి. దాంతో బిసినెస్ పరంగా ఈ సినిమా దిల్ రాజుకు నష్టాలను తెచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఈ తరహా కథలలో నటించలేదు.

 

ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలని మాస్ గానే ఇష్టపడతారన్న సంగతి తెలిసిందే. ఇంతకముందు విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించిన భారీ మల్టీ స్టారర్ గోపాల గోపాలా కూడా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఆ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన ఓ మై గాడ్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు వకీల్ సాబ్ మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: