టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘అ!’ లాంటి వెరైటీ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ తర్వాత రాజశేఖర్ తో 'కల్కి' అనే సినిమాని తెరకెక్కించి నిరాశపరిచాడు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంత్ వర్మ చాలామంది హీరోలకు స్టోరీలు చెబుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు రావడం జరిగింది. స్టార్ హీరోల నుండి కుర్ర హీరోల వరకూ చాలామందికి స్టోరీలు వినిపించిన కూడా ఒక్క అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై సినిమా తీయడానికి రెడీ అయ్యాడట. భూమిమీద అగ్ర రాజ్యాలు మరియు అభివృద్ధి చెందిన దేశాలు అని చెప్పుకునే వాళ్లు ప్రస్తుతం ఈ వైరస్ తో పోరాడలేక భయపడిపోతున్నారు. ఇదే టైమ్ లో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నమోదు అయ్యింది.

 

దీంతో ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటికి పరిమితమైన వారి మనస్తత్వాలు గురించి ఓ సినిమా రూపొందించడానికి ప్రశాంత్ వర్మ స్టోరీ రెడీ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో షట్ డౌన్ సమయంలో భార్యాభర్తలు మరియు యువత, పిల్లల మధ్య మనస్తత్వాలు అన్న రీతిలో...ఇంటికే పరిమితమై వాళ్లు ఆలోచించే విధానం అన్న కాన్సెప్ట్ లో సినిమా తెరకెక్కించాలని ఆలోచిస్తున్నారట.

 

ఇండస్ట్రీలో కొత్త వారు మరియు పాత వారి కలయికలో ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకుంటున్నారట. మరి ఈ సినిమాని ఎవరు నిర్మిస్తారో చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా డైరెక్టర్లు సినిమా హీరోలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటువంటి నేపథ్యంలో ప్రశాంత్ వర్మ ఈ సినిమాని ఏ విధంగా తెరకెక్కిస్తారు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. అధికారికంగా మే లేకపోతే జూన్ లోసినిమాకి అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 





క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: