కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వానికి సహాయ పడుతూ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమకి తోచినంతగా విరాళాలను అందజేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి సీనీ కార్మికుల కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధుల‌కు వీరు డొనేట్ చేశారు. ఈ విష‌యంలో వీరిని మెచ్చుకుని తీరాలి. అడ‌పాద‌డ‌పా ద‌క్షిణాది తార‌లు ఇలాంటి విరాళాలు ఇస్తూనే ఉన్నారు.   పవన్ కళ్యాన్ తెలుగు రాష్ట్రాలకు చెరో ఐభై లక్షలు డొనేట్ చేశారు. 

 

ప్ర‌భాస్, ప‌వ‌న్ క‌ల్యాణ్, మ‌హేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్ వంటి వాళ్లు ఏపీ-తెలంగాణ ప్ర‌భుత్వాల కు విరాళ నిధిని ప్ర‌క‌టించారు.  వీళ్ల బాటలోనే ఇతర నటులు కూడా విరాళాలు ప్రకటించారు.  తాజాగా అక్కినేని నాగార్జున కూడా సినీ శ్రేయస్సు కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ అవసరం తప్పనిసరి అని.. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని నాగార్జున కోరారు. ఇప్పటికే కరోనా నివారణకు నివారణ సూత్రాలను తెలిపిన మహేష్ బాబు.. లాక్ డౌన్ కారణంగా రోజూవారీ పనిచేసుకుంటూ జీవనం సాగించే సినీ కార్మికులను దృష్టిలో ఉంచుకొని వారికోసం కరోనా సంక్షోభ స్వచ్ఛంద సంస్థకు 25 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 

 

ఇలా ఒక్కో టాలీవుడ్ హీరో ఈ సమయంలో తమ సహృదయాన్ని చాటుకుంటూ ప్రజల్లో ధీమా నింపుతున్నారు.  కరోనా భయం వద్దని కొంత కాలం లాక్ డౌన్ ఉంటే అంతరించి పోతుందని అంటున్నారు.  కాగా, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తోటి నటులందరూ ముందుకు వచ్చి తమ సహకారాన్ని అందించమని అభ్యర్థిస్తున్నాను అని మహేష్ సోషల్ మాద్యంలో తెలిపారు.  ఈ సమయంలో మనిషికి మనిషి సహాయం ఎంతో అవసరం.. ఇలాంటి గడ్డు కాలంలో ఉన్నవారు లేని వారిని ఆదుకోవాలని అంటున్నారు. 

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: