అక్కినేని సమంత రీసెంట్ గా జాను సినిమాతో భారీ ఫ్లాప్ ని మూట గట్టుకుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 96 కి రీమేక్ గా దిల్ రాజు నిర్మించారు. సమంత శర్వానంద్ ఈ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోలీవుడ్ లో త్రిషకి మంచి కం బ్యాక్ మూవీ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా తో మళ్ళీ త్రిష ఫుల్ ఫాం లోకి వచ్చింది. కాని ఈ సినిమా రీమేక్ చేస్తే దిల్ రాజుకి చేతులు కాలాయి... సమంతకి హ్యాట్రిక్ హిట్ మిస్సయింది. ఇక శర్వానంద్ గురించి చెప్పనవసరం లేదు. 

 

ఇక ప్రస్తుతం అన్ని భాషల్లోను బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. తెలుగులో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి సినిమాని తెరకెక్కించారు. అలాగే ఎన్.టి.ఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించారు. ఇప్పుడు స‌మంత తో ప్ర‌ముఖ క‌ర్ణాట‌క గాయ‌ని, న‌ర్త‌కి, సాంస్క్ర‌తిక ఉద్య‌మ‌కారిణి, దేవ‌దాసి.. బెంగ‌ళూరు నాగ‌ర‌త్త‌మ్మ జీవిత క‌థ‌ ని సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు తెరకెక్కించనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

 

క‌ర్ణాట‌క సంగీత ప్రాచుర్యానికి విశేష కృషిచేయ‌డంతో పాటు త్యాగ‌రాజ ఆరాధ‌నోత్స‌వాల‌కు ఆద్యురాలిగా నాగ‌ర‌త్త‌మ్మ గొప్ప కీర్తి ని సాధించారు. అంతేకాదు మ‌హిళా హ‌క్కుల కోసం పోరాడారు. స్పూర్తిదాయ‌కంగా సాగిన ఆమె జీవిత క‌థ‌ను నేటి త‌రాల‌కు తెలియ‌జేసేందుకు భారీ స్థాయిలో ఈ సినిమాకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు లేటెస్ట్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సినిమా కోసం ఇప్పటి వరకు సింగీతం ఎవరిని కూడా ఆ పాత్ర కోసం సంప్రదించలేదట. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన తర్వాత ఆ పాత్ర కోసం నటీమనులను సంప్రదించడం మొదలు పెట్టాలని ఆయన భావిస్తున్నాడట. ప్రస్తుతానికి కరోనా కారణంగా స్క్రిప్ట్ వర్క్ కూడా మెల్లగా సాగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: