అలేఖ్య హారిక అంటే గుర్తుపట్టని వారు ఉండొచ్చు, కానీ 'దేత్తడి హారిక' అంటే తెలియని వారుండరు. సోషల్ మీడియాలలో ఈ అమ్మడుకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అలేఖ్య లాస్ట్ ఇయర్ 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'ఆదిత్య వర్మ' ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది. అలేఖ్య హారిక తెలంగాణ పిల్లగా 'దేత్తడి' ద్వారా యూట్యూబ్ లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అమెజాన్‌లో ఉద్యోగాన్ని వదులుకుని యాక్టింగ్‌లోకి అడుగుపెట్టింది. మొదట్లో కామెడీ వెబ్ సిరీస్ చేస్తుండేది. తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా యాక్ట్ చేసింది హారిక. తమాడా ప్రొడక్షన్స్‌లో 'చిత్రం విచిత్రం' అనే వెబ్ సిరిస్‌లో చేసింది. ఈ వెబ్ సిరీస్ దేత్తడి చానల్‌లో లీడ్ రోల్‌గా చేయడానికి బాగా ఉపయోగపడింది. తెలంగాణ పిల్లలా చక్కగా నటించి అందరి హృదయాలను కొల్లగొట్టింది. ఆన్ స్క్రీన్ లొనే కాదు,ఆఫ్ స్కీన్‌లో కూడా అలానే ఉంటుంది. అభిమానుల నుంచి అనుకూల స్పందన రావడంతో ఓవర్‌నైట్ సెలబ్రిటీ అయిపోయింది. సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. కానీ డాన్సర్ కావాలన్న కోరిక కోసం అన్ని వదులుకుంది. ఎప్పటికైనా ఒక కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుంటోంది. అందంతోపాటు అభినయం ఉన్న నటి అలేఖ్య హారిక.

 

'దేత్తడి' అనే పేరుతో యూట్యూబ్ ప్రేక్షకులను తన చిలిపి చేష్టలతో ఆకట్టుకుంటోంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ, తను నటించే ప్రతి పాత్ర ద్వారా నవ్విస్తోంది. అంతేకాకుండా ప్రతి ఎపిసోడ్‌లోనూ సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక మెసేజ్ తప్పకుండా ఇస్తుంది. యాంత్రిక జీవితంలో అలిసిపోయిన వారికి దేత్తడి ఎండమావిలో ఒయాసిస్సు లాంటిది. ఇప్పుడు లేటెస్టుగా 'వర్క్ ఫ్రమ్ హోమ్', 'ది ఇన్విజిలేటర్' ద్వారా మళ్ళీ మీ ముందుకు వచ్చింది. ఇవి కూడా యూట్యూబ్ లో మంచి ఆదరణ పొందుతున్నాయి. కరోనా ప్రభావ నేపథ్యంలో లాక్ డౌన్ లో జనాలకి ఈమె వీడియోలు కొంతమేర ఊరట కలిగిస్తాయని చెప్పవచ్చు. 

 

యూట్యూబ్ వీడియోస్ ద్వారా తనకంటూ ఒక మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ పిల్ల గ్లామర్ వరల్డ్ లో కూడా తనకు క్రేజ్ ని పెంచుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే అలేఖ్య, కుదిరినప్పుడల్లా ట్రెండీ ఫోటోలను అప్లోడ్ చేస్తూ నెటిజన్లకు టచ్ లో ఉంటుంది. ప్రస్తుతం దేత్తడి యూట్యూబ్ చానల్‌కు ఒక మిలియన్ పైగా సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు. మన తెలుగులో కూడా మంచి అవకాశాలు దక్కించుకుని సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: