ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కున్న సినిమా దర్శకధీరుడు రాజమౌళి  "ఆర్ ఆర్ ఆర్". బాహుబలి ప్రాంఛైజీ తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ గురించే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం చర్చించుకుంటుంది. టాలీవుడ్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ 'కొమరం భీమ్' గా రామ్ చరణ్ 'అల్లూరి సీతారామరాజు' గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'రౌద్రం రణం రుధిరం' అన్న టైటిల్ ని ఫైనల్ చేసి ఉగాది సందర్భంగా మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

 

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ తో 'రౌద్రం రణం రుధిరం' సినిమా మరో బాహుబలి అంటు అందరూ చెప్పుకుంటున్నారు. 
నిజంగా రాజమౌళి చరణ్ ని, తారక్ ని ఎలా చూపించబోతున్నారో ఈ టీజర్ చూసిన ప్రతీ ఒక్కరికి అర్థమైపోయింది. ఇదిలా ఉంటే 'రౌద్రం రణం రుధిరం' సినిమా కోసం తారక్ ఒక రిస్క్ చేయబోతున్నాడని సమాచారం. ఈ సినిమా తమిళ, హిందీ వెర్షన్ల కి ఎన్టీఆర్ స్వయంగా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పబోతున్నాడట. ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత కోలీవుడ్ లో మళ్ళీ ఆ రేంజ్ మార్కెట్ ని సాధించుకున్నాడు.

 

 దాంతో కోలీవుడ్ లో సూపర్ స్టార్ తర్వాత మళ్ళీ స్టార్ హీరో అంటే విజయ్ మాత్రమే. దాంతో ఇప్పుడు రాజమౌళి విజయ్ కోసం ఒక పాత్రని ఆర్.ఆర్.ఆర్ లో క్రియోట్ చేయబోతున్నాడని న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. హాలీవుడ్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కూడా ఉంటే పాన్ ఇండియా సినిమా అవుతుందని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. మరి జక్కన్న కోలీవుడ్ స్టార్ హీరోకి చిన్న క్యారెక్టర్ ఇస్తే చేస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: