సినిమా ప్ర‌పంచ‌మంటేనే  ఓ రంగుల ప్ర‌పంచం ఇక్క‌డంతా మాయ మాత్ర‌మే అని చాలా మంది చెబుతుంటారు. ఇక ఇదిలా ఉంటే... ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా లాక్‌డ‌వున్ లో ఉన్న విష‌యం తెలిసిందే. ఒక సినిమా తియ్య‌లంటే కేవ‌లం హీరో, హీరోయిన్ ద‌ర్శ‌క‌డు, నిర్మాత ఉంటే స‌రిపోదు కేవ‌లం ఈ న‌లుగురు మ‌నుషుల‌తో సినిమా మొత్తం అయిపోదు దీనికి చాలా మంది ప‌ని చేస్తుంటారు. కొన్ని వంద‌ల మంది కార్మికులు ఈ సినిమా వెనుక ఎంతో మంది ప‌ని చేస్తుంటారు. అయితే ఇందులో చిన్నా పెద్దా ఇలా ఎన్నో ప‌నులుంటాయి. అయితే రోజు ప‌ని చేస్తే ఆ వ‌చ్చే డ‌బ్బులుతో పూట‌గ‌డుపుకునేవారు చాలా మంది ఉంటారు ఈ సినీ ప్ర‌పంచంలో.

 

ఒక రోజు షూటింగ్‌కి వెళితే మూడు పూట‌లా భోజ‌నం పెట్టి అక్క‌డి ఇచ్చే డ‌యిలీ పేమెంట్‌ని తీసుకుని ఇంటికి వ‌చ్చేవారు చాలా మంది ఉంటారు. అలాంటిది ఇప్పుడు సినీ ప్ర‌పంచ‌మంతా మూగ‌బోయింది.  సినిమాలు ఎక్క‌డికక్క‌డ ఆగిపోతున్నాయి. షూటింగ్‌లు ఉండ‌డం లేదు. సినిమాలు అయిపోయి రిలీజులు లేక‌. అటు కొత్త సినిమాలు ప్రారంభోత్స‌వాలు అవ్వ‌కా. మ‌ధ్య‌లోనే వ‌దిలిపెట్టిన సినిమా షూటింగ్‌లు మొద‌ల‌వ్వ‌క ఇలా ఎంతో మంది సినీ కార్మికులు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే దీని కోసం కొంత మంది హీరోలు వాళ్ళ‌కి ఆర్ధికంగా స‌హాయ‌ప‌డిన‌ప్ప‌టికి. ఏదో మొక్కుబ‌డిగా ఒక‌రిద్ద‌రు ద‌ర్శ‌కులు మాత్రం ఏదో కొంత డ‌బ్బును విరాళంగా ఇచ్చి మ‌మా అనిపించుకున్నారు.

 

మ‌రి ఇది ఎంత వ‌ర‌కు న్యాయం అనిపిస్తుంది. వారు ఒక సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాలంటే రెమ్యూన‌రేష‌న్ ఏ రేంజ్‌లో తీసుకుంటారో ఎవ్వ‌ర‌కి తెలియ‌ని విష‌యం ఏమీ కాదు. అయితే వారు తీసుకునే రెమ్యూన‌రేష‌న్‌లో క‌నీసం పావువంతు భాగం విరాళంగా ఏ ఒక్క‌ద‌ర్శ‌కుడు ఇవ్వ‌లేదు.  ఇలాంటి స‌మ‌యాల్లో కూడా క‌నీసం ఆదుకునే బాధ్య‌త లేదు  అనుకుంటే ఎలా. వి.వి.వినాయ‌క్ టాప్ డైరెక్ట‌ర్ ఆయ‌న మ‌నం సైతంకి 5 ల‌క్ష‌ల‌ను ప్ర‌క‌టించారు. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ 10ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. కొర‌టాల శివ, అనిల్‌రావిపుడి ఇలా ప్ర‌క‌టించారు. వీళ్ళు తీసుకున్న రెమ్యూన‌రేష‌న్‌కి త‌గ్గ ప‌నులు చేస్తున్నారా ఒక‌సారి ఆలోచించండి అని సోష‌ల్‌మీడియాలో నెటిజ‌న్లు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: