టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి  గ్యాప్ ఉంది అన్నవిషయం ఓపెన్ సీక్రెట్. అయినా చిరంజీవి మోహన్ బాబులు ఇండస్ట్రీకి సంబంధించిన ఏఫంక్షన్ లో ఎదురైనా ఒకరి పై ఒకరు ప్రేమను కురిపించుకుంటూ తమ మధ్య ఎటువంటి గ్యాప్ లేదు అన్నట్లుగా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఉంటారు. 


ఆమధ్య  మంచు మనోజ్ మూవీ షూటింగ్ ప్రారంభానికి రామ్ చరణ్  గెస్ట్ గా వెళ్లినప్పుడు అదేవిధంగా చిరంజీవి ఈమధ్య సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిన సందర్భంలో స్వాగతం పలికిన మోహన్ బాబుని ఆట పట్టిస్తూ 'రాననుకున్నావా రాలేవనుకున్నావా' అంటూ చిరంజీవి మోహన్ బాబుకు రిప్లయ్ ఇచ్చిన సంఘటనలు చూస్తే చిరంజీవి మోహన్ బాబుల మధ్య గ్యాప్ ఉంది అంటే ఎవరు నమ్మరు. 


ఈ పరిస్థితుల నేపధ్యంలో ఈమధ్య మంచు విష్ణు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ వజ్రోత్సవాలు సమయంలో చిరంజీవికి జరిగిన సన్మానసందర్భంగా ఒక విషయమై పవన్ కళ్యాణ్ మోహన్ బాబుల మధ్య జరిగిన మాటల యుద్ధం అప్పట్లో పెద్ద దుమారాన్ని లేపింది. 


ఆ విషయాల గురించి మంచు విష్ణుతో ఇంటర్వ్యూ చేస్తున్న ఆ మీడియా సంస్థ ప్రతినిధి అప్పట్లో పవన్ కళ్యాణ్ అలా ఎందుకు మాట్లాడారని అడిగి ఇరుకున పెట్టడానికి ప్రయత్నించినప్పుడు చాల తెలివిగా సమాధానం ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఒకొక్కసారి చిన్న విషయం పై కూడ ఓవర్ గా రియాక్ట్ అవుతాడని దీనికి సంబంధించిన సమాధానం పవన్ ను అడిగితే బాగుంటుంది అంటూ తెలివిగా విష్ణు తప్పించుకున్నాడు. అంతేకాదు కొన్ని సంవత్సరాల నుండి తమ రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉంటున్నాయని ఈ జనరేషన్ హీరోలు కూడా చిరంజీవి మోహన్ బాబులని ఆదర్శంగా తీసుకోవాలని అంటూ కామెంట్ చేసాడు. వాస్తవానికి విష్ణు మోహన్ బాబు లా ఆవేశపరుడు కాదు. ఏ విషయాన్ని అయినా చాల తెలివిగా డీల్ చేస్తాడు. అందువల్లనే ప్రస్తుతం విష్ణు ఎడ్యుకేషన్ బిజినెస్ లో హైదరాబాద్ లో బాగా రాణిస్తున్న విద్య సంస్థలకు అధినేతగా కొనసాగుతున్నాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి: