తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు లాక్ డౌన్ తో సతమతమైపోతు ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితులలో కొనసాగుతూ ఉంటే రేణు దేశాయ్ షేర్ చేసిన ఒక వీడియో పై పవన్ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అంటూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సందేశం ఇచ్చిన స్పూర్తిని గుర్తుకు చేస్తూ ‘జీవితంలో పైకి రావాలంటే ముందు క‌ల‌లు క‌నాలి. ఆ త‌ర్వాత వాటిని సాధించేందుకు నిద్ర‌లేని రాత్రులు గ‌డ‌పాలి.’ అంటు రేణు దేశాయ్ ఈ వీడియోలో అభిప్రాయ పడింది. 


వికారాబాద్‌ లోని ఒక గ్రామంలో చిన్న‌పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డిపిన రేణు దేశాయ్ అక్కడ చిన్న పిల్లలతో కలిసి ఆవులు మేకలు కాకులు ఉన్న దృశ్యాలతో ఉన్న వీడియోను తన ఇన్ స్ట్రా గ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఎంతో ఆహ్లాదాన్ని పంచే  పల్లె జీవితాన్ని తాను కోల్పోతున్నాన‌ని తన ఆవేద‌నను వ్య‌క్త పరిచింది. అంతేకాదు తన పిల్లలు కాలేజీలో చేరిన తర్వాత మిగిలిన శేష జీవితాన్ని కూరగాయలు పండిస్తూ మారుమూల గ్రామంలో గడపాలని గ‌ట్టిగా  కోరుకుంటున్న‌ట్టు రేణు దేశాయ్ ఈ వీడియో ద్వారా తెలియ చేసింది. 


పది పిల్లులు 10 కుక్క‌లు మూగజీవాలు లెక్కలేనన్ని పుస్తకాలు ఉంటే చాలు త‌న‌కు స్వర్గం అని చెపుతూ తనకు నెరవేరే రోజు త్వరలోనే వస్తుంది అంటు కామెంట్ చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన పవన్ వీరాభిమాని ‘వదిన బయట తిరగవద్దు కరోనా వ్యాధి వ్యాప్తి భయంకరంగా ఉంది’ అంటూ సలహా ఇచ్చాడు. 


దీనితో కోపం తెచ్చుకుని ఘాటుగా సమాధానం ఇస్తూ ఈ వీడియోలు అన్నీ తాను ఇదివరకు తీసినవనీ అంటూ ఈ మాత్రం తేడా తెలుసుకోలేవా అని అంటూ తనను ప్రశ్నించిన పవన్ అభిమానులకు జర్క్ ఇచ్చింది.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో లాక్ డౌన్ కొనసాగుతున్న పవన్ ఖాళీగా ఉండకుండా తన ‘వకీల్ సాబ్’ డబ్బింగ్ అదేవిధంగా క్రిష్ సినిమా కోసం కత్తిసాము నేర్చుకుంటుంటే రేణు మాత్రం పవన్ మర్చిపోయిన అతడికి ఇష్టమైన పల్లె వాతావరణాన్ని ఈ వీడియో ద్వారా గుర్తు చేస్తోంది అనుకోవాలి..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: