టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఆ నలుగురులో ఒకరిగా ఇండస్ట్రీని శాసిస్తున్న దిల్ రాజ్ కు ఈ కొత్త సంవత్సరం సరిగ్గా కలిసిరాలేదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సంక్రాంతి రేస్ కు వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ పరంగా ఏమాత్రం లాభాలు రాకపోయినా తాను ఎన్నో ఆశలు పెట్టుకుని తీసిన ‘జాను’ ఫెయిల్ కావడంతో దిల్ రాజ్ కు కోట్లల్లో నష్టాలు వచ్చాయి అన్న ప్రచారం జరిగింది.


ఈ నష్టాలను ఉగాది నాడు ‘వి’ మూవీని విడుదల చేయడంతో రికవర్ అవ్వాలని ప్రయత్నిస్తే ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితులలో ఏప్రిల్ నెల అంతా కూడ ధియేటర్లు తెరుచుకొని పరిస్థితి. దీనికితోడు మేలో విడుదల చేయాలని చాల పట్టుదలతో ప్రయత్నిస్తూ పరుగులు తీయించిన ‘వకీల్ సాబ్’ మూవీ పై దిల్ రాజ్ డబ్బు 30 కోట్ల వరకు బ్లాక్ అయింది అన్న గాసిప్పులు వస్తున్నాయి.


ఇది చాలదు అన్నట్లుగా ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ పై ఇష్టంతో దిల్ రాజ్మూవీ రైట్స్ కోసం ఇప్పటికే 15 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చాడు అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కరోనా సమస్యలు అమెరికాను కూడ కుదిపేస్తున్న పరిస్థితులలో అక్కడ పరిస్థితులు చక్కపడే వరకు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులు బాగుపడినా సినిమాలు విడుదల అయ్యే మార్గం లేదు. 


దీనికితోడు దిల్ రాజ్ కు ఎగ్జిబిటర్ గా ముఫై థియేటర్ల వరకు చేతిలో ఉన్నాయి అని అంటున్నారు. ఈ ధియేటర్లలో షోలు పడకపోయినా ఈ ధియేటర్లలో పనిచేసే స్టాఫ్ కు వచ్చే ఫస్ట్ కు జీతాలు ఇవ్వవలసిన పరిస్థితి. ఇలా నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా ఎగ్జిబ్యూటర్ గా త్రిపాత్రాభినయం చేస్తున్న దిల్ రాజ్ ఈ మూడు బాధ్యలతో కోట్లల్లో అతడి మొత్తాలు బ్లాక్ అయ్యాయి అని అంటున్నారు. వాస్తవానికి దిల్ రాజ్ కు ఉన్న పరపతి రీత్యా ఈ మొత్తాలకు సంబంధించి రొటేట్ చేయడం సులువే అయినప్పటికీ ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న వాతావరణం దిల్ రాజ్ ను కలవర పడుతున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: