రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్ర మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ లుక్ కూడా బయటకి వచ్చేసింది. ఎన్నో రోజులుగా ఆర్.ఆర్.ఆర్ అంటే ఏంటని ఎదురుచూస్తున్న వారికి రౌద్రం రణం రుధిరం అంటూ ఆర్.ఆర్.ఆర్ అనే పిలుచుకునేట్లుగా టైటిల్ ని రివీల్ చేశాడు. అన్ని భాషల్లోనూ అదే అర్థాన్ని ఇచ్చిన రాజమౌళి హిందీలో మాత్రం రైజ్, రోర్, రివోల్ట్ గా పెట్టాడు. ఏ విషయంలోనైనా పర్ ఫెక్ట్ గా ఉండే రాజమౌళి మోషన్ పోస్టర్ తో ఒక్కసారిగా అంచనాలు పెంచేశాడు.

 

నీరు నిప్పు కాన్సెప్ట్ తో చాలా కొత్తగా వచ్చాడు. నీరు, నిప్పు అనేవి పంచభూతాల్లో భాగం. ఆ రెండు శక్తులు కలిసి వస్తే వచ్చే మూడవ శక్తి ఎలా ఉంటుందో ఆర్.ఆర్.ఆర్ లో చూపించనున్నాడట. మోషన్ పోస్టర్ కే కాదు రామ్ చరణ్ లుక్ కి అందరూ ఫిదా అయ్యారు. అల్లూరి సీతారామరాజుని పరిచయం చేయడం చాలా అద్భుతంగా ప్లాన్ చేశాడు. రామ్ చరణ్ పుట్టినరోజున భీమ్ ఇచ్చే గిఫ్ట్ గా దీన్ని అభివర్ణించాడు.

 


కొమరంభీమ్ ఇచ్చిన గిఫ్ట్ అందరికీ నచ్చేసింది. ఎన్టీఆర్ గొంతులోని గాంభీర్యంతో గూస్ బంప్స్ తెప్పించాడు. నాలుగు భాషల్లోనూ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్ ప్రతీ భాషలోనూ అది తన మాతృభాషే అన్నంత స్పష్టంగా చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా హిందీలో ఎన్టీఆర్ వాయిస్ కి బాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఫిదా అవుతున్నారు. పర్ ఫెక్ట్ డిక్షన్ తో అలరించాడు. అయితే ఇది చూసినప్పటి నుండి అందరూ చరణ్ ఎన్టీఆర్ కి ఇచ్చే గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. 

 

రామరాజుని పరిచయం చేసిన భీమ్ గొంతులోని గాంభీర్యం భీమ్ ని పరిచయం చేసే రామరాజు గొంతులో కనబడాలని ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ వాయిస్ తో చరణ్ ఎలా ఎలివేట్ అయ్యాడో.. అలా రామ్ చరణ్ వాయిస్ లో ఎన్టీఆర్ ఎలివేట్ అవ్వాలని కోరుకుంటున్నారు. అలాగే అన్ని భాషల్లోనూ చరణే వాయిస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ చరణ్ కి పెద్ద బాధ్యతనే అప్పగించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: