పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని స్టార్ హీరోయిన్స్ అంటా పోటీ పడుతుంటే ఒక హీరోయిన్ మాత్రం పవన్ తో నటించి పెద్ద తప్పు చేశా అంటుంది. పవన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం పెద్ద పొరపాటని చెబుతుంది. పవన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం వల్లే తన మీద అందరి కళ్ళు పడ్డాయని.. దాని వల్ల తనకు అవకాశాలు రాకుండా పోయానని వింత వాదన వినిపిస్తుంది. ఇంతకీ పవన్ తో నటించడం వల్లే తన కెరియర్ ఇలా అయ్యింది అనుకుంటున్నా హీరోయిన్ ఎవరో తెలుసా.. ఇంకెవరు పవర్ స్టార్ కెరియర్ లో డిజాస్టర్ కా బాప్ అనిపించినా పులి సినిమా హీరోయిన్ నిఖిషా పటేల్. 

 

పవన్ తో ఛాన్స్ రావడమే లక్కీ అనుకున్న ఈ అమ్మడు తన అదృష్టం బాగుందని సంబరపడినా అది చూసి మిగతా వాళ్ళు కుళ్ళుకున్నారని అందుకే తనకు అవకాశాలు రాలేదని అంటుంది. టాలెంట్ ఉంటే ఎవరు ఏం అనుకున్నా.. ఎవరు ఎన్ని అడ్డు గోడలు వేసినా ఛాన్సులు వస్తాయి. పవన్ సినిమా తర్వాత సరైన సినిమాల ఎంపిక చేసుకోలేని నిఖిషా తను ఇలా కెరియర్ లో వెనుకపడటానికి పవన్ తో మొదటి సినిమా చేయడమే అన్నట్టుగా చెప్పుకొస్తుంది. అమ్మడి వాదన వింతగా ఉంది కదా ఎవరైనా మొదటి సినిమా స్టార్ తో చేస్తే ఆ క్రేజ్ తో ఇంకొన్ని సినిమాలు చేజిక్కించుకుంటారు కానీ ఆ విషయంలో నిఖిషా పూర్తగా ఫెయిల్ అయ్యింది. 

 

పవన్ సినిమా తర్వాత చిన్న సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత అడ్రెస్ లేకుండా పోయింది. ప్రేక్షకులను  ఆకట్టుకుంటూనే అందం తన సొంతమైనా సరే సినిమాల ఎంపికలో అమ్మడు చేసిన పొరపాట్లు ఆమెకు అవకాశాలు లేకుండా చేశాయి. పవన్ సినిమా టైం లోనే కొద్దిగా జాగ్రత్తపడి ఉంటే ఇప్పుడు ఇలా బాధపడాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. ఇక్కడ అమ్మడు తెలుసుకోవాల్సిన అసలు వాస్తవం ఏంటంటే పవన్ తో చేసింది కాబట్టే ఆమెని ఇప్పటికి ఆడియెన్స్ గుర్తుపడుతున్నారు. అలా కాకుండా ఏదో చిన్న బడ్జెట్ సినిమా చేస్తే ఇప్పుడు ఆమె ఎవరని అడిగినా అడుగుతారని చెప్పడంలో సందేహం లేదు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: